Jeremiah · chapter 48 · verse 13
Jeremiah 48:13 in Telugu
ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు
Ishraayeluvaaru taamaashrayinchina betelunubatti siggupadinatlu moyaabeeyulunu kemoshunubatti siggupaduchunnaaru
Jeremiah 48:13 in English
- King James Version (KJV)
- And Moab shall be ashamed of Chemosh, as the house of Israel was ashamed of Beth-el their confidence.
- World English Bible (WEB)
- Moab will be ashamed of Chemosh, as the house of Israel was ashamed of Bethel, their confidence.
- American Standard Version (ASV)
- And Moab shall be ashamed of Chemosh, as the house of Israel was ashamed of Beth-el their confidence.
- Bible in Basic English (BBE)
- And Moab will be shamed on account of Chemosh, as the children of Israel were shamed on account of Beth-el their hope.
- Darby Translation (DBY)
- And Moab shall be ashamed of Chemosh, as the house of Israel was ashamed of Bethel, their confidence.
- Webster's Bible (WBS)
- And Moab shall be ashamed of Chemosh, as the house of Israel was ashamed of Beth-el their confidence.
- Young's Literal Translation (YLT)
- And ashamed hath been Moab because of Chemosh, As the house of Israel have been ashamed Because of Beth-El their confidence.
Read in context
- 11మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
- 12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు.
- 13ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు
- 14మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు?
- 15మోయాబు పాడైపోవుచున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి యౌవనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చినమాట యిదే.
Cross references
- Isaiah 45:16 యెషయా 45:16విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.
- Judges 11:24 న్యాయాధిపతులు 11:24స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము.
- Jeremiah 48:39 యిర్మీయా 48:39అంగలార్చుడి మోయాబు సమూలధ్వంసమాయెను మోయాబూ, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టునున్న వారికందరికి అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును.
- Hosea 8:5–6 హోషేయ 8:5–6షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు? అది ఇశ్రాయేలువారి చేతి పనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.
- Jeremiah 48:7 యిర్మీయా 48:7నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ము కొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.
- 1 Kings 18:40 1 రాజులు 18:40అప్పుడు ఏలీయాఒకనినైన తప్పించు కొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.
- 1 Kings 12:28–29 1 రాజులు 12:28–29ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము; ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.
- Jeremiah 48:46 యిర్మీయా 48:46మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబూ, నీకు శ్రమ కెమోషుజనులు నశించియున్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు.
- Isaiah 16:12 యెషయా 16:12మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాస పడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడు వారికేమియు దొరకకపోవును.
- 1 Kings 18:26–29 1 రాజులు 18:26–29వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకుబయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరి గాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలీయావాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయు చున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచునుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయమువరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని, మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యముచేసినవాడైనను లేక పోయెను.
- Isaiah 45:20 యెషయా 45:20కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.
- Isaiah 46:1–2 యెషయా 46:1–2బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.