Jeremiah · chapter 48 · verse 3
Jeremiah 48:3 in Telugu
ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది.
Aalakinchudi, horonayeemunundi rodanadhvani vinabaduchunnadi dopudu jaruguchunnadi mahaapajayamu sambhavinchu chunnadi.
Jeremiah 48:3 in English
- King James Version (KJV)
- A voice of crying [shall be] from Horonaim, spoiling and great destruction.
- World English Bible (WEB)
- The sound of a cry from Horonaim, desolation and great destruction!
- American Standard Version (ASV)
- The sound of a cry from Horonaim, desolation and great destruction!
- Bible in Basic English (BBE)
- There is the sound of crying from Horonaim, wasting and great destruction;
- Darby Translation (DBY)
- A voice of crying from Horonaim; wasting and great destruction!
- Webster's Bible (WBS)
- A voice of crying [shall be] from Horonaim, devastation and great destruction.
- Young's Literal Translation (YLT)
- A voice of a cry [is] from Horonaim, Spoiling and great destruction.
Read in context
- 1మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
- 2హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ నుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది.
- 3ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది.
- 4మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది.
- 5హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు.
Cross references
- Isaiah 15:5 యెషయా 15:5మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొనయీము త్రోవను పోవుదురు.
- Jeremiah 48:34 యిర్మీయా 48:34నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు.
- Jeremiah 48:5 యిర్మీయా 48:5హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు.
- Jeremiah 4:20–21 యిర్మీయా 4:20–21కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి. నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచుచుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?
- Jeremiah 47:2 యిర్మీయా 47:2యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లు గాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించు వారిమీదను ప్రవహించును.
- Isaiah 22:4 యెషయా 22:4నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి.
- Isaiah 15:8 యెషయా 15:8రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును వినబడెను.
- Isaiah 16:7–11 యెషయా 16:7–11కావున మోయాబీయులు మోయాబునుగూర్చి అంగ లార్చుదురు అందరును అంగలార్చుదురు మోయాబీయులారా కేవలము పాడైయున్న కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా వల్లులు వాడిపోయెను దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరువరకు వ్యాపించెను అరణ్యములోనికిప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపె దను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహ ధ్వని వినబడదు గానుగులలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను మాన్పించియున్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరెశు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి.
- Isaiah 15:2 యెషయా 15:2ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది