Jeremiah · chapter 48 · verse 4
Jeremiah 48:4 in Telugu
మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది.
Moyaabu raajyamu layamai poyenu daani biddala rodanadhvani vinabaduchunnadi.
Jeremiah 48:4 in English
- King James Version (KJV)
- Moab is destroyed; her little ones have caused a cry to be heard.
- World English Bible (WEB)
- Moab is destroyed. Her little ones have caused a cry to be heard.
- American Standard Version (ASV)
- Moab is destroyed; her little ones have caused a cry to be heard.
- Bible in Basic English (BBE)
- Moab is broken; her cry has gone out to Zoar.
- Darby Translation (DBY)
- Moab is destroyed; her little ones have caused a cry to be heard.
- Webster's Bible (WBS)
- Moab is destroyed; her little ones have caused a cry to be heard.
- Young's Literal Translation (YLT)
- Destroyed hath been Moab, Caused a cry to be heard have her little ones.
Read in context
- 2హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ నుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది.
- 3ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది.
- 4మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది.
- 5హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు.
- 6పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి.
Cross references
- Numbers 21:27–30 సంఖ్యాకాండము 21:27–30కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగాఇచ్చెను. వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు.
- Esther 8:11 ఎస్తేరు 8:11రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆ యా ప్రదేశములలో నుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశు వులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూల పరచి
- Psalm 137:9 కీర్తనలు 137:9నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు.