Jeremiah · chapter 7 · verse 19
Jeremiah 7:19 in Telugu
నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.
Naake kopamu puttinchunantagaa vaaru daani cheyuchunnaaraa? Tamake avamaanamu kalugu nantagaa cheyuchunnaaru gadaa, yide yehovaa vaakku.
Jeremiah 7:19 in English
- King James Version (KJV)
- Do they provoke me to anger? saith the LORD: [do they] not [provoke] themselves to the confusion of their own faces?
- World English Bible (WEB)
- Do they provoke me to anger?” says the LORD. “Don’t they provoke themselves, to the confusion of their own faces?”
- American Standard Version (ASV)
- Do they provoke me to anger? saith Jehovah; [do they] not [provoke] themselves, to the confusion of their own faces?
- Bible in Basic English (BBE)
- Are they moving me to wrath? says the Lord; are they not moving themselves to their shame?
- Darby Translation (DBY)
- Is it I whom they provoke to anger? saith Jehovah; is it not themselves, to the shame of their own face?
- Webster's Bible (WBS)
- Do they provoke me to anger? saith the LORD: [do they] not [provoke] themselves to the confusion of their own faces?
- Young's Literal Translation (YLT)
- Me are they provoking to anger? an affirmation of Jehovah, Is it not themselves, For the shame of their own faces?
Read in context
- 17యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా.
- 18నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
- 19నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.
- 20అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.
- 21సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి.
Cross references
- 1 Corinthians 10:22 1 కొరింథీయులకు 10:22ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?
- Jeremiah 9:19 యిర్మీయా 9:19మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది.
- Ezekiel 8:17–18 యెహెజ్కేలు 8:17–18అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును.
- Job 35:6 యోబు 35:6నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా?
- Jeremiah 20:11 యిర్మీయా 20:11అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్న డును మరువబడని నిత్యావమానము పొందుదురు.
- Jeremiah 2:19 యిర్మీయా 2:19నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయ భక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెల విచ్చుచున్నాడు.
- Daniel 9:7–8 దానియేలు 9:7–8ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితివిు; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశము లోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పర దేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్న బోవునట్లుగా సిగ్గే తగియున్నది.
- Deuteronomy 32:16 ద్వితీయోపదేశకాండము 32:16వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టిం చిరిహేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి
- Isaiah 1:20 యెషయా 1:20సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.
- Deuteronomy 32:21–22 ద్వితీయోపదేశకాండము 32:21–22వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.
- Isaiah 45:16 యెషయా 45:16విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.
- Ezra 9:7 ఎజ్రా 9:7మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజు లును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమున కును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతివిు.