Job · chapter 11 · verse 15
Job 11:15 in Telugu
నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.
Nishchayamugaa nirdoshivai neevu santoshinchedavu nirbhayudavai neevu sthirapadi yunduvu.
Job 11:15 in English
- King James Version (KJV)
- For then shalt thou lift up thy face without spot; yea, thou shalt be stedfast, and shalt not fear:
- World English Bible (WEB)
- Surely then you will lift up your face without spot. Yes, you will be steadfast, and will not fear,
- American Standard Version (ASV)
- Surely then shalt thou lift up thy face without spot; Yea, thou shalt be stedfast, and shalt not fear:
- Bible in Basic English (BBE)
- Then truly your face will be lifted up, with no mark of sin, and you will be fixed in your place without fear:
- Darby Translation (DBY)
- Surely then shalt thou lift up thy face without spot, and thou shalt be stedfast and shalt not fear:
- Webster's Bible (WBS)
- For then shalt thou lift up thy face without spot; yes, thou shalt be steadfast, and shalt not fear:
- Young's Literal Translation (YLT)
- For then thou liftest up thy face from blemish, And thou hast been firm, and fearest not.
Read in context
- 13నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీ చేతులు ఆయనవైపు చాపినయెడల
- 14పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచిన యెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల
- 15నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.
- 16నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.
- 17అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.
Cross references
- Job 22:26 యోబు 22:26అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.
- 1 John 3:19–22 1 యోహాను 3:19–22ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు చున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింప వలెననునదియే.
- 1 John 2:28 1 యోహాను 2:28కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి.
- 1 Timothy 2:8 1 తిమోతికి 2:8కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.
- Proverbs 14:26 సామెతలు 14:26యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును
- Proverbs 28:1 సామెతలు 28:1ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
- Job 10:15 యోబు 10:15నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.
- Psalm 112:6–8 కీర్తనలు 112:6–8అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.
- Psalm 46:1 కీర్తనలు 46:1దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
- 2 Corinthians 1:12 2 కొరింథీయులకు 1:12మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
- Psalm 27:1 కీర్తనలు 27:1యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
- Genesis 4:5–6 ఆదికాండము 4:5–6కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి?