Job · chapter 11 · verse 6
Job 11:6 in Telugu
ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.
Aayane jnyaanarahasyamulu neeku teliyajesina melu appudu jnyaanamu nee yochanaku minchinadani neevutelisikonduvu nee doshamulo adhika bhaagamu devudu marachipoyiyunnaadani telisikonumu.
Job 11:6 in English
- King James Version (KJV)
- And that he would shew thee the secrets of wisdom, that [they are] double to that which is! Know therefore that God exacteth of thee [less] than thine iniquity [deserveth].
- World English Bible (WEB)
- that he would show you the secrets of wisdom! For true wisdom has two sides. Know therefore that God exacts of you less than your iniquity deserves.
- American Standard Version (ASV)
- And that he would show thee the secrets of wisdom! For he is manifold in understanding. Know therefore that God exacteth of thee less than thine iniquity deserveth.
- Bible in Basic English (BBE)
- And would make clear to you the secrets of wisdom, and the wonders of his purpose!
- Darby Translation (DBY)
- And that he would shew thee the secrets of wisdom, how that they are the double of what is realised; and know that God passeth by [much] of thine iniquity!
- Webster's Bible (WBS)
- And that he would show thee the secrets of wisdom, that [they are] double to that which is! Know therefore that God exacteth of thee [less] than thy iniquity [deserveth] .
- Young's Literal Translation (YLT)
- And declare to thee secrets of wisdom, For counsel hath foldings. And know thou that God forgetteth for thee, [Some] of thine iniquity.
Read in context
- 4నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
- 5దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు
- 6ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.
- 7దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?
- 8అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు?పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?
Cross references
- Ezra 9:13 ఎజ్రా 9:13అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి
- Lamentations 3:22 విలాపవాక్యములు 3:22యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
- Ephesians 3:5 ఎఫెసీయులకు 3:5ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు.
- Daniel 2:28 దానియేలు 2:28అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరు నకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా
- Matthew 13:35 మత్తయి 13:35అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.
- Job 15:8 యోబు 15:8నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?
- Job 15:11 యోబు 15:11దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా?
- Psalm 25:14 కీర్తనలు 25:14యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.
- Romans 16:25–26 రోమీయులకు 16:25–26సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును
- Job 9:4 యోబు 9:4ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?
- Job 15:5 యోబు 15:5నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.
- Deuteronomy 29:29 ద్వితీయోపదేశకాండము 29:29రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.