Job · chapter 11 · verse 4
Job 11:4 in Telugu
నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
Naa upadeshamu nirdoshamaniyudevaa, needrushtiki nenu pavitrudananiyu neevanuchunnaave.
Job 11:4 in English
- King James Version (KJV)
- For thou hast said, My doctrine [is] pure, and I am clean in thine eyes.
- World English Bible (WEB)
- For you say, ‘My doctrine is pure. I am clean in your eyes.’
- American Standard Version (ASV)
- For thou sayest, My doctrine is pure, And I am clean in thine eyes.
- Bible in Basic English (BBE)
- You may say, My way is clean, and I am free from sin in your eyes.
- Darby Translation (DBY)
- For thou sayest, My doctrine is pure, and I am clean in thine eyes.
- Webster's Bible (WBS)
- For thou hast said, My doctrine [is] pure, and I am clean in thy eyes.
- Young's Literal Translation (YLT)
- And thou sayest, 'Pure [is] my discourse, And clean I have been in Thine eyes.'
Read in context
- 2ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
- 3నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
- 4నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
- 5దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు
- 6ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.
Cross references
- Job 10:7 యోబు 10:7నీవేల నా దోషమునుగూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు?
- Job 6:10 యోబు 6:10అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును
- Job 9:2–3 యోబు 9:2–3వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు.
- 1 Peter 3:15 1 పేతురు 3:15నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;
- Job 7:20 యోబు 7:20నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?
- Job 6:29–30 యోబు 6:29–30అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?
- Job 14:4 యోబు 14:4పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.
- Job 34:5–6 యోబు 34:5–6నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
- Job 35:2 యోబు 35:2నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే?