Job · chapter 15 · verse 32
Job 15:32 in Telugu
వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.
Vaari kaalamu raakamunde adi jarugunu appude vaari komma vaadipovunu.
Job 15:32 in English
- King James Version (KJV)
- It shall be accomplished before his time, and his branch shall not be green.
- World English Bible (WEB)
- It will be accomplished before his time. His branch will not be green.
- American Standard Version (ASV)
- It shall be accomplished before his time, And his branch shall not be green.
- Bible in Basic English (BBE)
- His branch is cut off before its time, and his leaf is no longer green.
- Darby Translation (DBY)
- It shall be complete before his day, and his branch shall not be green.
- Webster's Bible (WBS)
- It shall be accomplished before his time, and his branch shall not be green.
- Young's Literal Translation (YLT)
- Not in his day is it completed, And his bending branch is not green.
Read in context
- 30వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు.
- 31వారు మాయను నమ్ముకొనకుందురు గాక;వారు మోస పోయిన వారుమాయయే వారికి ఫలమగును.
- 32వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.
- 33ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును
- 34భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును
Cross references
- Ecclesiastes 7:17 ప్రసంగి 7:17అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు?
- Psalm 55:23 కీర్తనలు 55:23దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి యున్నాను.
- Hosea 9:16 హోషేయ 9:16ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.
- Job 22:16 యోబు 22:16వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.
- Job 14:7–9 యోబు 14:7–9వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియుదానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రముచేత అది చిగుర్చునులేత మొక్కవలె అది కొమ్మలు వేయును.
- Ezekiel 17:8–10 యెహెజ్కేలు 17:8–10కావున నీవీలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా? అది యెండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు, దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు. అది నాటబడినను వృద్ధి పొందునా? తూర్పుగాలి దానిమీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదిలోనే యెండి పోవును.
- Hosea 14:5–7 హోషేయ 14:5–7చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.
- Job 18:16–17 యోబు 18:16–17క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును. భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.
- Job 8:16–19 యోబు 8:16–19అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును. అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనునురాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.
- Isaiah 27:11 యెషయా 27:11దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.
- Psalm 52:5–8 కీర్తనలు 52:5–8కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును. (సెలా. ) నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమ్మిక యుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు కొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను
- John 15:6 యోహాను 15:6ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును.