Job · chapter 8 · verse 2
Job 8:2 in Telugu
ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.
Enta kaalamu neevitti maatalaadedavu? Nee noti maatalu sudigaali vantivaayenu.
Job 8:2 in English
- King James Version (KJV)
- How long wilt thou speak these [things]? and [how long shall] the words of thy mouth [be like] a strong wind?
- World English Bible (WEB)
- “How long will you speak these things? Shall the words of your mouth be a mighty wind?
- American Standard Version (ASV)
- How long wilt thou speak these things? And [how long] shall the words of thy mouth be [like] a mighty wind?
- Bible in Basic English (BBE)
- How long will you say these things, and how long will the words of your mouth be like a strong wind?
- Darby Translation (DBY)
- How long wilt thou speak these things? and the words of thy mouth be a strong wind?
- Webster's Bible (WBS)
- How long wilt thou speak these [things] ? and [how long shall] the words of thy mouth [be like] a strong wind?
- Young's Literal Translation (YLT)
- Till when dost thou speak these things? And a strong wind — sayings of thy mouth?
Read in context
- 1అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను
- 2ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.
- 3దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?
- 4నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమోకావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో.
Cross references
- Job 15:2 యోబు 15:2జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?
- Job 6:26 యోబు 6:26మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలివంటివే గదా.
- 1 Kings 19:11 1 రాజులు 19:11అందుకాయననీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.
- Job 16:3 యోబు 16:3ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?
- Job 11:2–3 యోబు 11:2–3ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
- Job 7:11 యోబు 7:11కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.
- Proverbs 1:22 సామెతలు 1:22ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?
- Exodus 10:7 నిర్గమకాండము 10:7అప్పుడు ఫరో సేవకులు అతని చూచి - ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకా తెలియదా అనిరి.
- Exodus 10:3 నిర్గమకాండము 10:3కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి - హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా - నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
- Job 6:9 యోబు 6:9దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక.
- Job 18:2 యోబు 18:2మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.
- Job 19:2–3 యోబు 19:2–3ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు? పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.