Joel · chapter 3 · verse 5
Joel 3:5 in Telugu
నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి.
Naa vendini naa bangaaramunu meeru pattukonipotiri; naaku priyamaina manchi vastuvulanu pattukonipoyi mee gullalo unchukontiri.
Joel 3:5 in English
- King James Version (KJV)
- Because ye have taken my silver and my gold, and have carried into your temples my goodly pleasant things:
- World English Bible (WEB)
- Because you have taken my silver and my gold, and have carried my finest treasures into your temples,
- American Standard Version (ASV)
- Forasmuch as ye have taken my silver and my gold, and have carried into your temples my goodly precious things,
- Bible in Basic English (BBE)
- For you have taken my silver and my gold, putting in the houses of your gods my beautiful and pleasing things.
- Darby Translation (DBY)
- because ye have taken my silver and my gold, and have carried into your temples my beautiful pleasant things,
- Webster's Bible (WBS)
- Because ye have taken my silver and my gold, and have carried into your temples my goodly pleasant things.
- Young's Literal Translation (YLT)
- In that My silver and My gold ye took, And My desirable things that are good, Ye have brought in to your temples.
Read in context
- 3వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా?
- 4తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నా కేమైన చేయుదురా?
- 5నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి.
- 6యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసినదానిని బహుత్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.
- 7ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆ యా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును
Cross references
- 2 Chronicles 21:16–17 2 దినవృత్తాంతములు 21:16–17మరియు యెహోవా యెహోరాముమీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా వారు యూదా దేశముమీదికి వచ్చి దానిలో చొరబడి రాజ నగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి; అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు.
- 2 Kings 24:13 2 రాజులు 24:13మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొని పోయెను.
- 2 Kings 18:15–16 2 రాజులు 18:15–16కావున హిజ్కియా యెహోవా మందిర మందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను.
- 2 Kings 12:18 2 రాజులు 12:18యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషా పాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసికొనిసిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూష లేమునొద్దనుండి తిరిగిపోయెను.
- 2 Kings 16:8 2 రాజులు 16:8నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా
- Daniel 11:38 దానియేలు 11:38అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును; బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి, ఆ దేవతను ఘనపరచును.
- Jeremiah 51:11 యిర్మీయా 51:11బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు చున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.
- Daniel 5:2–3 దానియేలు 5:2–3బెల్షస్సరు ద్రాక్షా రసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి.
- 1 Samuel 5:2–5 1 సమూయేలు 5:2–5దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడిగడపను త్రొక్కుటలేదు.
- 2 Kings 25:13–17 2 రాజులు 25:13–17మరియు యెహోవా మందిరమందున్న యిత్తిడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి. సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొని పోయిరి. అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను. ఒక్కొక స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు. దాని పైపీట యిత్తడిది, పైపీట నిడివి మూడు మూరలు. మరియు ఆ పైపీటచుట్టు ఉన్న అల్లికలును దానిమ్మపండ్లును ఇత్తడివి; రెండవ స్తంభమును వీటివలె అల్లికపని కలిగియుండెను.
- Jeremiah 50:28 యిర్మీయా 50:28ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడు చున్నది మన దేవుడగు యెహోవా చేయు ప్రతికార సమా చారమును తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతికార సమాచారమును సీయోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు.