John · chapter 15 · verse 1
John 15:1 in Telugu
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
Nenu nijamaina draakshaavallini, naa tandri vyavasaayakudu.
John 15:1 in English
- King James Version (KJV)
- I am the true vine, and my Father is the husbandman.
- World English Bible (WEB)
- “I am the true vine, and my Father is the farmer.
- American Standard Version (ASV)
- I am the true vine, and my Father is the husbandman.
- Bible in Basic English (BBE)
- I am the true vine and my Father is the gardener.
- Darby Translation (DBY)
- I am the true vine, and my Father is the husbandman.
- Webster's Bible (WBS)
- I am the true vine, and my Father is the husbandman.
- Young's Literal Translation (YLT)
- 'I am the true vine, and my Father is the husbandman;
Read in context
- 1నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
- 2నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును.
- 3నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు.
Cross references
- Jeremiah 2:21 యిర్మీయా 2:21శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటి తిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతాన మైతివి?
- Isaiah 27:2–3 యెషయా 27:2–3ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.
- 1 Corinthians 3:9 1 కొరింథీయులకు 3:9మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
- Isaiah 60:21 యెషయా 60:21నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.
- Psalm 80:8–19 కీర్తనలు 80:8–19నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం చెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగెలు సముద్రమువరకు వ్యాపించెను యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దానిచుట్టునున్న కంచెలను నీవేల పాడుచేసితివి? అడవిపంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టివలన జనులు నశించుచున్నారు. నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్దనుండి తొలగిపోము నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.
- Isaiah 4:2 యెషయా 4:2ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.
- John 6:55 యోహాను 6:55నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.
- Isaiah 5:1–7 యెషయా 5:1–7నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను కావున యెరూషలేము నివాసులారా, యూదావార లారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసి యుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.
- Jeremiah 12:10 యిర్మీయా 12:10కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు.
- 1 John 2:8 1 యోహాను 2:8మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించు చున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే.
- Mark 12:1 మార్కు 12:1ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారం భించెను; ఎట్లనగాఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరముపోయెను.
- Hosea 10:1 హోషేయ 10:1ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి.