Joshua · chapter 17 · verse 12
Joshua 17:12 in Telugu
కనానీయులు ఆ దేశ ములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టి యుండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేక పోయిరి.
Kanaaneeyulu aa desha mulo nivasimpavalenani gattipattu patti yundiri ganuka manashsheeyulu aa puramulanu svaadheenaparachukonaleka poyiri.
Joshua 17:12 in English
- King James Version (KJV)
- Yet the children of Manasseh could not drive out [the inhabitants of] those cities; but the Canaanites would dwell in that land.
- World English Bible (WEB)
- Yet the children of Manasseh couldn’t drive out the inhabitants of those cities; but the Canaanites would dwell in that land.
- American Standard Version (ASV)
- Yet the children of Manasseh could not drive out [the inhabitants of] those cities; but the Canaanites would dwell in that land.
- Bible in Basic English (BBE)
- But the children of Manasseh were not able to make the people of those towns go out; but the Canaanites would go on living in that land.
- Darby Translation (DBY)
- But the children of Manasseh could not dispossess [the inhabitants of] those cities; and the Canaanites would dwell in that land.
- Webster's Bible (WBS)
- Yet the children of Manasseh could not expel [the inhabitants of] those cities; but the Canaanites would dwell in that land.
- Young's Literal Translation (YLT)
- And the sons of Manasseh have not been able to occupy these cities, and the Canaanite is desirous to dwell in this land,
Read in context
- 10సము ద్రము వారి సరిహద్దు; ఉత్తరదిక్కున అది ఆషేరీయుల సరిహద్దుకును, తూర్పుదిక్కున ఇశ్శాఖారీయుల సరిహద్దు కును నడిచెను.
- 11ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశ ములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి యున్నది.
- 12కనానీయులు ఆ దేశ ములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టి యుండిరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేక పోయిరి.
- 13ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు.
- 14అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతోమా కేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమేగదా? ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవిచేయగా
Cross references
- Exodus 23:29–33 నిర్గమకాండము 23:29–33దేశము పాడై అడవిమృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను. నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను. మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు. నీవు వారితో నైనను వారి దేవ తలతోనైనను నిబంధన చేసికొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింప కూడదు.
- Judges 1:27–28 న్యాయాధిపతులు 1:27–28మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొన లేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు.
- Numbers 33:52–56 సంఖ్యాకాండము 33:52–56ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని. మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.
- Joshua 16:10 యెహోషువ 16:10అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు దాసులైయున్నారు.
- Romans 6:12–14 రోమీయులకు 6:12–14కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
- Joshua 15:63 యెహోషువ 15:63యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.