Leviticus · chapter 17 · verse 8
Leviticus 17:8 in Telugu
మరియు నీవు వారితో ఇట్లనుముఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను
Mariyu neevu vaarito itlanumuishraayeleeyula kutumbamulalogaani meelo nivasinchu paradeshulalo gaani okadu dahanabalinainanu veroka ye balinainanu
Leviticus 17:8 in English
- King James Version (KJV)
- And thou shalt say unto them, Whatsoever man [there be] of the house of Israel, or of the strangers which sojourn among you, that offereth a burnt offering or sacrifice,
- World English Bible (WEB)
- “You shall say to them, ‘Any man there is of the house of Israel, or of the strangers who live as foreigners among them, who offers a burnt offering or sacrifice,
- American Standard Version (ASV)
- And thou shalt say unto them, Whatsoever man there be of the house of Israel, or of the strangers that sojourn among them, that offereth a burnt-offering or sacrifice,
- Bible in Basic English (BBE)
- And say to them, If any man of Israel, or any other living among them, makes a burned offering or other offering,
- Darby Translation (DBY)
- And thou shalt say unto them, Every one of the house of Israel, and of the strangers who sojourn among them, that offereth up a burnt-offering or sacrifice,
- Webster's Bible (WBS)
- And thou shalt say to them, Whatever man [there may be] of the house of Israel, or of the strangers which sojourn among you, that offereth a burnt-offering or sacrifice,
- Young's Literal Translation (YLT)
- 'And unto them thou sayest: Any man of the house of Israel, or of the sojourners, who sojourneth in your midst, who causeth burnt-offering or sacrifice to ascend,
Read in context
- 6యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము నొద్దనున్న యెహోవా బలిపీఠముమీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను.
- 7వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.
- 8మరియు నీవు వారితో ఇట్లనుముఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను
- 9యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.
- 10మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును.
Cross references
- Leviticus 1:2–3 లేవీయకాండము 1:2–3నీవు ఇశ్రా యేలీయులతో ఇట్లనుముమీలో ఎవరైనను యెహో వాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱెల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొని రావలెను. అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.
- 1 Samuel 16:2 1 సమూయేలు 16:2సమూయేలునేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవానీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి
- Malachi 1:11 మలాకీ 1:11తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Leviticus 17:4 లేవీయకాండము 17:4ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళె ములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును;
- Leviticus 17:10 లేవీయకాండము 17:10మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును.
- Judges 6:26 న్యాయాధిపతులు 6:26తగిన యేర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహో వాకు బలిపీఠము కట్టి, ఆ రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించు మని అతనితో చెప్పెను.
- 1 Samuel 10:8 1 సమూయేలు 10:8నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా, దహనబలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగి వత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయువరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను.
- 1 Kings 18:30–38 1 రాజులు 18:30–38అప్పుడు ఏలీయానా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి, యహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగామీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను అదియైన తరువాతరెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు ఆ నీళ్లు బలి పీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.
- 1 Samuel 7:9 1 సమూయేలు 7:9సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రా యేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.
- 2 Samuel 24:25 2 సమూయేలు 24:25అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను.