Leviticus · chapter 20 · verse 19
Leviticus 20:19 in Telugu
నీ తల్లి సహో దరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానా చ్ఛాదన మునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.
Nee talli saho dari maanaachchhaadanamunegaani nee tandri sahodari maanaa chchhaadana munegaani teeyakoodadu; teesinavaadu tana rakta sambandhiyokka maanaachchhaadanamunu teesenu; vaaru tama doshashikshanu bharinchedaru.
Leviticus 20:19 in English
- King James Version (KJV)
- And thou shalt not uncover the nakedness of thy mother’s sister, nor of thy father’s sister: for he uncovereth his near kin: they shall bear their iniquity.
- World English Bible (WEB)
- “‘You shall not uncover the nakedness of your mother’s sister, nor of your father’s sister, for he has made his close relative naked. They shall bear their iniquity.
- American Standard Version (ASV)
- And thou shalt not uncover the nakedness of thy mother’s sister, nor of thy father’s sister; for he hath made naked his near kin: they shall bear their iniquity.
- Bible in Basic English (BBE)
- And you may not have sex connection with your mother's sister or your father's sister, for they are his near relations: their sin will be on them.
- Darby Translation (DBY)
- And the nakedness of thy mother's sister, and of thy father's sister shalt thou not uncover; for he hath laid naked his near relation: they shall bear their iniquity.
- Webster's Bible (WBS)
- And thou shalt not uncover the nakedness of thy mother's sister, nor of thy father's sister: for he uncovereth his near kin: they shall bear their iniquity.
- Young's Literal Translation (YLT)
- 'And the nakedness of thy mother's sister, and of thy father's sister, thou dost not uncover; because his relation he hath made bare; their iniquity they bear.
Read in context
- 17ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.
- 18కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదన మును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజ లలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.
- 19నీ తల్లి సహో దరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానా చ్ఛాదన మునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.
- 20పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.
- 21ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.
Cross references
- Leviticus 18:6 లేవీయకాండము 18:6మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదన మును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.
- Leviticus 18:12–30 లేవీయకాండము 18:12–30నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదన మును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి. నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయ కూడదు. నీ సహోదరుని భార్యమానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన. నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు. అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు. నీవు ఏ మాత్రమును నీ సంతానమునుమోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము. ఏ జంతువు నందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొన కూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వా టన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్ట డలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొ నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొన కుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
- Exodus 6:20 నిర్గమకాండము 6:20అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.