Leviticus · chapter 22 · verse 5
Leviticus 22:5 in Telugu
అపవిత్రమైన పురుగునేమి యేదో ఒక అపవిత్రతవలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును, అట్టి అప విత్రత తగిలినవాడును సాయంకాలమువరకు అపవిత్రుడగును.
Apavitramaina purugunemi yedo oka apavitratavalana apavitrudaina manushyuninemi muttuvaadunu, atti apa vitrata tagilinavaadunu saayankaalamuvaraku apavitrudagunu.
Leviticus 22:5 in English
- King James Version (KJV)
- Or whosoever toucheth any creeping thing, whereby he may be made unclean, or a man of whom he may take uncleanness, whatsoever uncleanness he hath;
- World English Bible (WEB)
- or whoever touches any creeping thing by which he may be made unclean, or a man from whom he may become unclean, whatever uncleanness he has—
- American Standard Version (ASV)
- or whosoever toucheth any creeping thing, whereby he may be made unclean, or a man of whom he may take uncleanness, whatsoever uncleanness he hath;
- Bible in Basic English (BBE)
- Or anyone touching any unclean thing which goes flat on the earth, or someone by whom he may be made unclean in any way whatever;
- Darby Translation (DBY)
- or a man that toucheth any crawling thing whereby he becometh unclean, or a man by whom he may become unclean, whatever may be his uncleanness,
- Webster's Bible (WBS)
- Or whoever toucheth any creeping animal, by which he may be made unclean, or a man of whom he may take uncleanness, whatever uncleanness he hath:
- Young's Literal Translation (YLT)
- or a man who cometh against any teeming thing which is unclean to him, or against a man who is unclean to him, even any of his uncleanness —
Read in context
- 3నీవు వారితో ఇట్లనుముమీ తర తరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.
- 4అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమై నను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును,
- 5అపవిత్రమైన పురుగునేమి యేదో ఒక అపవిత్రతవలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును, అట్టి అప విత్రత తగిలినవాడును సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- 6అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు.
- 7సూర్యుడు అస్త మించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైనవాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా.
Cross references
- Leviticus 15:7 లేవీయకాండము 15:7స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును.
- Leviticus 11:43–44 లేవీయకాండము 11:43–44ప్రాకు జీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగ జేసికొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.
- Leviticus 15:19 లేవీయకాండము 15:19స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు.
- Leviticus 11:24–28 లేవీయకాండము 11:24–28వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచె మైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును; వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రు డగును; అవి మీకు అపవిత్రమైనవి.