Leviticus · chapter 22 · verse 7
Leviticus 22:7 in Telugu
సూర్యుడు అస్త మించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైనవాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా.
Sooryudu asta minchinappudu atadu pavitrudagunu; taruvaata atadu pratishthitamainavaatini tinavachchunu, avi vaaniki aahaarame gadaa.
Leviticus 22:7 in English
- King James Version (KJV)
- And when the sun is down, he shall be clean, and shall afterward eat of the holy things; because it [is] his food.
- World English Bible (WEB)
- When the sun is down, he shall be clean; and afterward he shall eat of the holy things, because it is his bread.
- American Standard Version (ASV)
- And when the sun is down, he shall be clean; and afterward he shall eat of the holy things, because it is his bread.
- Bible in Basic English (BBE)
- And when the sun has gone down he will be clean; and after that he may take part in the holy food, because it is his bread.
- Darby Translation (DBY)
- and when the sun goeth down, he shall be clean, and may afterwards eat of the holy things; for it is his food.
- Webster's Bible (WBS)
- And when the sun is set, he shall be clean, and shall afterward eat of the holy things, because it [is] his food.
- Young's Literal Translation (YLT)
- and the sun hath gone in, and he hath been clean, and afterwards he doth eat of the holy things, for it [is] his food;
Read in context
- 5అపవిత్రమైన పురుగునేమి యేదో ఒక అపవిత్రతవలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును, అట్టి అప విత్రత తగిలినవాడును సాయంకాలమువరకు అపవిత్రుడగును.
- 6అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు.
- 7సూర్యుడు అస్త మించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైనవాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా.
- 8అతడు కళేబరమునైనను చీల్చ బడినదానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను.
- 9కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి, దాని పాపభారమును మోసికొని దానివలన చావకుండు నట్లు ఈ విధిని ఆచరించవలెను; నేను వారిని పరిశుద్ధ పరచు యెహోవాను.
Cross references
- Leviticus 21:22 లేవీయకాండము 21:22అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.
- Numbers 18:11–19 సంఖ్యాకాండము 18:11–19మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును. వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని. వారు తమ దేశపు పంటలన్ని టిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తిన వచ్చును. ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుష్యులలోనిదేమి జంతువులలోని దేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణ మునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు. అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱెయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠిత మైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీదగును. అల్లాండిపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమా ర్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్ని ధిని నిత్యమును స్థిరమైన నిబంధన.
- 1 Corinthians 9:4 1 కొరింథీయులకు 9:4తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?
- 1 Corinthians 9:13–14 1 కొరింథీయులకు 9:13–14ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నా రనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా? ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువునియమించియున్నాడు.
- Deuteronomy 18:3–4 ద్వితీయోపదేశకాండము 18:3–4యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను.