Leviticus · chapter 6 · verse 7
Leviticus 6:7 in Telugu
ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.
Aa yaajakudu yehovaa sannidhini atani nimittamu praayashchittamu cheyagaa atadu aparaadhi yagunatlu taanu chesina vaatannitilo pratidaani vishayamai ataniki kshamaapana kalugunu.
Leviticus 6:7 in English
- King James Version (KJV)
- And the priest shall make an atonement for him before the LORD: and it shall be forgiven him for any thing of all that he hath done in trespassing therein.
- World English Bible (WEB)
- The priest shall make atonement for him before the LORD, and he will be forgiven concerning whatever he does to become guilty.”
- American Standard Version (ASV)
- and the priest shall make atonement for him before Jehovah; and he shall be forgiven concerning whatsoever he doeth so as to be guilty thereby.
- Bible in Basic English (BBE)
- And the priest will take away his sin from before the Lord, and he will have forgiveness for whatever crime he has done
- Darby Translation (DBY)
- And the priest shall make atonement for him before Jehovah, and it shall be forgiven him concerning anything of all that he hath done so as to trespass therein.
- Webster's Bible (WBS)
- And the priest shall make an atonement for him before the LORD: and it shall be forgiven him for any thing of all that he hath done in trespassing therein.
- Young's Literal Translation (YLT)
- and the priest hath made atonement for him before Jehovah, and it hath been forgiven him, concerning one thing of all that he doth, by being guilty therein.'
Read in context
- 5ఆ మూల ధనము నిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను.
- 6అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను.
- 7ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.
- 8మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- 9నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలినిగూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉద యమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించు చుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించు చుండును.
Cross references
- Leviticus 4:26 లేవీయకాండము 4:26సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలి పీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
- 1 John 2:1–2 1 యోహాను 2:1–2నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.
- 1 John 1:9 1 యోహాను 1:9మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
- 1 John 1:7 1 యోహాను 1:7అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
- Matthew 12:31 మత్తయి 12:31కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.
- Ezekiel 33:14–16 యెహెజ్కేలు 33:14–16మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను అనుస రించుచు కుదువసొమ్మును మరల అప్పగించుచు, తాను దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపక యుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు, అతడు నీతిన్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రదుకును.
- Ezekiel 33:19 యెహెజ్కేలు 33:19మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతిన్యాయములను అనుసరించినయెడల వాటినిబట్టి అతడు బ్రదుకును.
- 1 Corinthians 6:9–11 1 కొరింథీయులకు 6:9–11అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చ బడితిరి.
- Leviticus 4:31 లేవీయకాండము 4:31మరియు సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజ కుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజ కుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
- Leviticus 4:20 లేవీయకాండము 4:20అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయ వలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును.
- Leviticus 5:15–16 లేవీయకాండము 5:15–16ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విష యములో పొరబాటున పాపముచేసినయెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలోనుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవాయొద్దకు వాడు తీసికొని రావలెను. పరిశుద్ధమైనదాని విషయ ములో తాను చేసిన పాపమువలని నష్టము నిచ్చుకొని దానితో అయిదవవంతు యాజకునికియ్యవలెను. ఆ యాజకుడు అప రాధపరిహారార్థ బలియగు పొట్టేలువలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
- Leviticus 5:18 లేవీయకాండము 5:18కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకు తీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.