Luke · chapter 18 · verse 10
Luke 18:10 in Telugu
ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.
Praarthanacheyutakai yiddaru manushyulu devaalayamunaku velliri. Vaarilo okadu parisayyudu, okadu sunkari.
Luke 18:10 in English
- King James Version (KJV)
- Two men went up into the temple to pray; the one a Pharisee, and the other a publican.
- World English Bible (WEB)
- “Two men went up into the temple to pray; one was a Pharisee, and the other was a tax collector.
- American Standard Version (ASV)
- Two men went up into the temple to pray; the one a Pharisee, and the other a publican.
- Bible in Basic English (BBE)
- Two men went up to the Temple for prayer; one a Pharisee, and the other a tax-farmer.
- Darby Translation (DBY)
- Two men went up into the temple to pray; the one a Pharisee, and the other a tax-gatherer.
- Webster's Bible (WBS)
- Two men went up into the temple to pray; the one a Pharisee, and the other a publican.
- Young's Literal Translation (YLT)
- 'Two men went up to the temple to pray, the one a Pharisee, and the other a tax-gatherer;
Read in context
- 8ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
- 9తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.
- 10ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.
- 11పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
- 12వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.
Cross references
- Matthew 21:31–32 మత్తయి 21:31–32అందుకు వారుమొదటివాడే అనిరి. యేసుసుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్ము నట్లు పశ్చాత్తాపపడక పోతిరి.
- Acts 3:1 అపొస్తలుల కార్యములు 3:1పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,
- 1 Kings 8:30 1 రాజులు 8:30మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్న పము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.
- 2 Kings 20:5 2 రాజులు 20:5నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.
- Acts 26:5 అపొస్తలుల కార్యములు 26:5వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.
- Luke 7:29–30 లూకా 7:29–30ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.
- 2 Kings 20:8 2 రాజులు 20:8యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదు ననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను
- Philippians 3:5 ఫిలిప్పీయులకు 3:5ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై,
- Acts 23:6–8 అపొస్తలుల కార్యములు 23:6–8వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.
- Luke 1:9–10 లూకా 1:9–10యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా