Luke · chapter 2 · verse 11
Luke 2:11 in Telugu
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు
Daaveedu pattanamandu nedu rakshakudu mee koraku putti yunnaadu, eeyana prabhuvaina kreestu
Luke 2:11 in English
- King James Version (KJV)
- For unto you is born this day in the city of David a Saviour, which is Christ the Lord.
- World English Bible (WEB)
- For there is born to you today, in David’s city, a Savior, who is Christ the Lord.
- American Standard Version (ASV)
- for there is born to you this day in the city of David a Saviour, who is Christ the Lord.
- Bible in Basic English (BBE)
- For on this day, in the town of David, a Saviour has come to birth, who is Christ the Lord.
- Darby Translation (DBY)
- for to-day a Saviour has been born to you in David's city, who is Christ [the] Lord.
- Webster's Bible (WBS)
- For to you is born this day, in the city of David, a Savior, who is Christ the Lord.
- Young's Literal Translation (YLT)
- because there was born to you to-day a Saviour — who is Christ the Lord — in the city of David,
Read in context
- 9ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.
- 10అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;
- 11దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు
- 12దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.
- 13వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి
Cross references
- Isaiah 9:6 యెషయా 9:6ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
- Matthew 1:21 మత్తయి 1:21తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.
- Acts 2:36 అపొస్తలుల కార్యములు 2:36మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
- Titus 3:4–7 తీతుకు 3:4–7మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.
- Matthew 16:16 మత్తయి 16:16అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
- 1 John 5:1 1 యోహాను 5:1యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును.
- John 4:42 యోహాను 4:42మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.
- Luke 1:43 లూకా 1:43నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?
- Philippians 2:11 ఫిలిప్పీయులకు 2:11ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
- Luke 2:4 లూకా 2:4యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు
- Acts 5:31 అపొస్తలుల కార్యములు 5:31ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు.
- 1 Corinthians 15:47 1 కొరింథీయులకు 15:47మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.