Luke · chapter 2 · verse 23
Luke 2:23 in Telugu
ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును,
Prati tolichoolu magapilla prabhuvuku pratishtha cheyabadavalenu ani prabhuvu dharmashaastramandu vraayabadinattu aaya nanu prabhuvuku pratishthinchutakunu,
Luke 2:23 in English
- King James Version (KJV)
- (As it is written in the law of the Lord, Every male that openeth the womb shall be called holy to the Lord;)
- World English Bible (WEB)
- (as it is written in the law of the Lord, “Every male who opens the womb shall be called holy to the Lord”),
- American Standard Version (ASV)
- (as it is written in the law of the Lord, Every male that openeth the womb shall be called holy to the Lord),
- Bible in Basic English (BBE)
- (As it says in the law of the Lord, Every mother's first male child is to be holy to the Lord),
- Darby Translation (DBY)
- (as it is written in the law of [the] Lord: Every male that opens the womb shall be called holy to the Lord),
- Webster's Bible (WBS)
- (As it is written in the law of the Lord, Every male that is the first born of his mother shall be called holy to the Lord)
- Young's Literal Translation (YLT)
- as it hath been written in the Law of the Lord, — 'Every male opening a womb shall be called holy to the Lord,'
Read in context
- 21ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
- 22మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు
- 23ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును,
- 24ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.
- 25యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతి మంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.
Cross references
- Exodus 13:2 నిర్గమకాండము 13:2ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.
- Numbers 3:13 సంఖ్యాకాండము 3:13ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూ లును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.
- Exodus 22:29 నిర్గమకాండము 22:29నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయ కూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను.
- Exodus 34:19 నిర్గమకాండము 34:19ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొఱ్ఱె పిల్లయేగాని అది నాదగును
- Numbers 18:15 సంఖ్యాకాండము 18:15మనుష్యులలోనిదేమి జంతువులలోని దేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.
- Numbers 8:16–17 సంఖ్యాకాండము 8:16–17ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయ బడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయు లలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను. ఏలయనగా మనుష్యులలోను పశు వులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించు కొంటిని.
- Exodus 13:12–15 నిర్గమకాండము 13:12–15ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయ వలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగ వానిని వెలయిచ్చి విడిపింపవలెను. ఇకమీదట నీ కుమారుడు - ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి - బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.