Luke · chapter 21 · verse 22
Luke 21:22 in Telugu
లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు.
Lekhanamulalo vraayabadina vanniyu nera verutakai avi prati dandana dinamulu.
Luke 21:22 in English
- King James Version (KJV)
- For these be the days of vengeance, that all things which are written may be fulfilled.
- World English Bible (WEB)
- For these are days of vengeance, that all things which are written may be fulfilled.
- American Standard Version (ASV)
- For these are days of vengeance, that all things which are written may be fulfilled.
- Bible in Basic English (BBE)
- For these are the days of punishment, in which all the things in the Writings will be put into effect.
- Darby Translation (DBY)
- for these are days of avenging, that all the things that are written may be accomplished.
- Webster's Bible (WBS)
- For these are the days of vengeance, that all things which are written may be fulfilled.
- Young's Literal Translation (YLT)
- because these are days of vengeance, to fulfil all things that have been written.
Read in context
- 20యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.
- 21అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింప కూడదు.
- 22లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు.
- 23ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.
- 24వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూష లేము అన్యజనములచేత త్రొక్కబడును.
Cross references
- Hosea 9:7 హోషేయ 9:7శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తార మైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించిన వారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.
- Isaiah 65:12–16 యెషయా 65:12–16నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరు వధకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు. నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరు వాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును.
- Jeremiah 51:6 యిర్మీయా 51:6మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికారకాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు.
- Isaiah 63:4 యెషయా 63:4పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను
- 2 Peter 2:9 2 పేతురు 2:9భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు,
- Isaiah 34:8 యెషయా 34:8అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము.
- Daniel 9:24–27 దానియేలు 9:24–27తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణము నకును డెబ్బదివారములు విధింపబడెను. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును. ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.
- Mark 13:19–20 మార్కు 13:19–20అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.
- 2 Peter 3:7 2 పేతురు 3:7అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
- Psalm 149:7–9 కీర్తనలు 149:7–9అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.
- Matthew 1:22 మత్తయి 1:22ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
- Isaiah 61:2 యెషయా 61:2యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును