Luke · chapter 22 · verse 33
Luke 22:33 in Telugu
అయితే అతడు ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా
Ayite atadu prabhuvaa, neetokooda cheralonikini maranamunakunu vellutaku siddhamugaa unnaanani aayanato anagaa
Luke 22:33 in English
- King James Version (KJV)
- And he said unto him, Lord, I am ready to go with thee, both into prison, and to death.
- World English Bible (WEB)
- He said to him, “Lord, I am ready to go with you both to prison and to death!”
- American Standard Version (ASV)
- And he said unto him, Lord, with thee I am ready to go both to prison and to death.
- Bible in Basic English (BBE)
- And he said to him, Lord, I am ready to go with you to prison and to death.
- Darby Translation (DBY)
- And he said to him, Lord, with thee I am ready to go both to prison and to death.
- Webster's Bible (WBS)
- And he said to him, Lord, I am ready to go with thee both into prison, and to death.
- Young's Literal Translation (YLT)
- And he said to him, 'Sir, with thee I am ready both to prison and to death to go;'
Read in context
- 31సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని
- 32నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
- 33అయితే అతడు ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా
- 34ఆయనపేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను.
- 35మరియు ఆయనసంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారుఏమియు తక్కువకాలేదనిరి.
Cross references
- Mark 14:31 మార్కు 14:31అతడు మరి ఖండితముగానేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి.
- Matthew 26:33–35 మత్తయి 26:33–35అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పేతురాయనను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగ నని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.
- John 13:36–37 యోహాను 13:36–37సీమోను పేతురు - ప్రభువా, నీవెక్కడికి వెళ్లు చున్నావని ఆయనను అడుగగా యేసునేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా
- Mark 14:29 మార్కు 14:29అందుకు పేతురు అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
- Matthew 20:22 మత్తయి 20:22అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు త్రాగగలమనిరి.
- Matthew 26:40–41 మత్తయి 26:40–41ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి
- Proverbs 28:26 సామెతలు 28:26తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.
- Acts 20:23–24 అపొస్తలుల కార్యములు 20:23–24బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్ట ణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును. అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.
- Mark 14:37–38 మార్కు 14:37–38మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొనియుండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
- Acts 21:13 అపొస్తలుల కార్యములు 21:13పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- said · G2036ἔπω épō
- him · G846αὐτός autós
- Lord · G2962κύριος kýrios
- am · G1510εἰμί eimí
- ready · G2092ἕτοιμος hétoimos
- go · G4198πορεύομαι poreúomai
- with · G3326μετά metá
- thee · G4675σοῦ soû
- both · G2532καί kaí
- into · G1519εἰς eis
- prison · G5438φυλακή phylakḗ
- and · G2532καί kaí
- to · G1519εἰς eis
- death · G2288θάνατος thánatos