Mark · chapter 10 · verse 34
Mark 10:34 in Telugu
వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.
Vaaru aayananu apahasinchi, aayana meeda ummivesi, koradaalato aayananu kotti champedaru; moodu dinamulaina taruvaata aayana tirigi lechunani cheppenu.
Mark 10:34 in English
- King James Version (KJV)
- And they shall mock him, and shall scourge him, and shall spit upon him, and shall kill him: and the third day he shall rise again.
- World English Bible (WEB)
- They will mock him, spit on him, scourge him, and kill him. On the third day he will rise again.”
- American Standard Version (ASV)
- and they shall mock him, and shall spit upon him, and shall scourge him, and shall kill him; and after three days he shall rise again.
- Bible in Basic English (BBE)
- And they will make sport of him, and put shame on him, and give him cruel blows, and will put him to death; and after three days he will come back from the dead.
- Darby Translation (DBY)
- and they shall mock him, and shall scourge him, and shall spit upon him, and shall kill him; and after three days he shall rise again.
- Webster's Bible (WBS)
- And they will mock him, and will scourge him, and will spit upon him, and will kill him: and the third day he will rise again.
- Young's Literal Translation (YLT)
- and they shall mock him, and scourge him, and spit on him, and kill him, and the third day he shall rise again.'
Read in context
- 32వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయ మొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి
- 33ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింప బడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్య జనుల కప్పగించెదరు.
- 34వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.
- 35జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయ గోరుచున్నామని చెప్పగా
- 36ఆయననేను మీకేమి చేయ గోరుచున్నారని వారి నడిగెను.
Cross references
- Matthew 26:67 మత్తయి 26:67అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;
- Matthew 16:21 మత్తయి 16:21అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా
- Mark 14:65 మార్కు 14:65కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచుప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.
- Luke 22:63–65 లూకా 22:63–65యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
- Mark 15:17–20 మార్కు 15:17–20ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి, యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి. వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి.
- Mark 15:29–31 మార్కు 15:29–31అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించు కొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచువీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు.
- Luke 23:11 లూకా 23:11హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను.
- Luke 23:35–39 లూకా 23:35–39ప్రజలు నిలువబడి చూచు చుండిరి; అధికారులునువీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పైవిలాసముకూడ ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను.
- Isaiah 50:6 యెషయా 50:6కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు
- John 19:2–3 యోహాను 19:2–3సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.
- Mark 14:63 మార్కు 14:63ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని యేమి?
- John 2:10 యోహాను 2:10ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.