Mark · chapter 15 · verse 2
Mark 15:2 in Telugu
పిలాతుయూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను.
Pilaatuyoodula raajavu neevenaa? Ani aayana nadugagaa aayana neevannatte ani atanito cheppenu.
Mark 15:2 in English
- King James Version (KJV)
- And Pilate asked him, Art thou the King of the Jews? And he answering said unto him, Thou sayest [it].
- World English Bible (WEB)
- Pilate asked him, “Are you the King of the Jews?” He answered, “So you say.”
- American Standard Version (ASV)
- And Pilate asked him, Art thou the King of the Jews? And he answering saith unto him, Thou sayest.
- Bible in Basic English (BBE)
- And Pilate put a question to him, Are you the King of the Jews? And he, answering, said to him, You say so.
- Darby Translation (DBY)
- And Pilate asked him, Art thou the King of the Jews? And he answered and said to him, Thou sayest.
- Webster's Bible (WBS)
- And Pilate asked him, Art thou the King of the Jews? And he answering, said to him, Thou sayest [it] .
- Young's Literal Translation (YLT)
- and Pilate questioned him, 'Art thou the king of the Jews?' and he answering said to him, 'Thou dost say [it].'
Read in context
- 1ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి.
- 2పిలాతుయూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను.
- 3ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా
- 4పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.
Cross references
- Matthew 2:2 మత్తయి 2:2యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
- Matthew 27:11–14 మత్తయి 27:11–14యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
- 1 Timothy 6:13 1 తిమోతికి 6:13సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,
- Mark 15:26 మార్కు 15:26మరియు యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి.
- Mark 15:18 మార్కు 15:18యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.
- John 19:19–22 యోహాను 19:19–22మరియు పిలాతు యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. యేసు సిలువవేయ బడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గానియూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతునేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.
- John 18:29–38 యోహాను 18:29–38కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారువీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి. పిలాతు మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా యేసునీ అంతట నీవే యీ మాట అను చున్నావా? లేక యితరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? అని అడిగెను. అందుకు పిలాతు నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు - నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు - నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;
- Mark 15:12 మార్కు 15:12అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను.
- Luke 23:2–3 లూకా 23:2–3ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయననీ వన్నట్టే అని అతనితో చెప్పెను.
- Mark 15:9 మార్కు 15:9ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని