Matthew · chapter 13 · verse 1
Matthew 13:1 in Telugu
ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్రతీరమున కూర్చుండెను.
Aa dinamandu yesu intanundi velli samudrateeramuna koorchundenu.
Matthew 13:1 in English
- King James Version (KJV)
- The same day went Jesus out of the house, and sat by the sea side.
- World English Bible (WEB)
- On that day Jesus went out of the house and sat by the seaside.
- American Standard Version (ASV)
- On that day went Jesus out of the house, and sat by the sea side.
- Bible in Basic English (BBE)
- On that day Jesus went out of the house and was seated by the seaside.
- Darby Translation (DBY)
- And that [same] day Jesus went out from the house and sat down by the sea.
- Webster's Bible (WBS)
- The same day Jesus went out of the house, and sat by the sea side.
- Young's Literal Translation (YLT)
- And in that day Jesus, having gone forth from the house, was sitting by the sea,
Read in context
- 1ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్రతీరమున కూర్చుండెను.
- 2బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా
- 3ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.
Cross references
- Luke 8:4–10 లూకా 8:4–10బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మింగివేసెను. మరి కొన్ని రాతినేలనుపడి, మొలిచి, చెమ్మలేనందున ఎండి పోయెను. మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. మరికొన్ని మంచినేలనుపడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచువినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా ఆయనదేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడు చున్నవి. )
- Matthew 13:1–15 మత్తయి 13:1–15ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్రతీరమున కూర్చుండెను. బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చినీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు. కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియువారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.
- Mark 4:1–12 మార్కు 4:1–12ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుం డెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి. ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదం తలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యులతో కూడ ఆయనచుట్టు ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి. అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను
- Matthew 13:36 మత్తయి 13:36అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటి లోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిపొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి.