Matthew · chapter 13 · verse 42
Matthew 13:42 in Telugu
అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.
Akkada edpunu pandlukorukutayunu undunu.
Matthew 13:42 in English
- King James Version (KJV)
- And shall cast them into a furnace of fire: there shall be wailing and gnashing of teeth.
- World English Bible (WEB)
- and will cast them into the furnace of fire. There will be weeping and gnashing of teeth.
- American Standard Version (ASV)
- and shall cast them into the furnace of fire: there shall be the weeping and the gnashing of teeth.
- Bible in Basic English (BBE)
- And will put them into the fire; there will be weeping and cries of sorrow.
- Darby Translation (DBY)
- and they shall cast them into the furnace of fire; there shall be the weeping and the gnashing of teeth.
- Webster's Bible (WBS)
- And shall cast them into a furnace of fire: there shall be wailing and gnashing of teeth.
- Young's Literal Translation (YLT)
- and shall cast them to the furnace of the fire; there shall be the weeping and the gnashing of the teeth.
Read in context
- 40గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును.
- 41మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.
- 42అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.
- 43అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.
- 44పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును.
Cross references
- Matthew 13:50 మత్తయి 13:50వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.
- Luke 16:23–24 లూకా 16:23–24అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను - నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను.
- Matthew 8:12 మత్తయి 8:12రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Revelation 20:14–15 ప్రకటన 20:14–15మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
- Revelation 20:10 ప్రకటన 20:10వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.
- Revelation 19:20 ప్రకటన 19:20అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
- Mark 9:43–49 మార్కు 9:43–49నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు. నీకన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయ బడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును.
- Psalm 21:9 కీర్తనలు 21:9నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురుతన కోపమువలన యెహోవా వారిని నిర్మూలముచేయును అగ్ని వారిని దహించును.
- Revelation 14:10 ప్రకటన 14:10ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.
- Daniel 3:6 దానియేలు 3:6సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయ బడును.
- Matthew 22:13 మత్తయి 22:13అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.
- Daniel 3:21–22 దానియేలు 3:21–22వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.