Micah · chapter 4 · verse 12
Micah 4:12 in Telugu
కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవా వారిని సమ కూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొన కున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.
Kallamulo okadu panalu koorchunattu yehovaa vaarini sama koorchunu, ayite vaaru aayana talampulu telisikona kunnaaru, aayana aalochana vaaru grahimpakunnaaru.
Micah 4:12 in English
- King James Version (KJV)
- But they know not the thoughts of the LORD, neither understand they his counsel: for he shall gather them as the sheaves into the floor.
- World English Bible (WEB)
- But they don’t know the thoughts of the LORD, neither do they understand his counsel; for he has gathered them like the sheaves to the threshing floor.
- American Standard Version (ASV)
- But they know not the thoughts of Jehovah, neither understand they his counsel; for he hath gathered them as the sheaves to the threshing-floor.
- Bible in Basic English (BBE)
- But they have no knowledge of the thoughts of the Lord, their minds are not able to see his purpose: for he has got them together like stems of grain to the crushing-floor.
- Darby Translation (DBY)
- But they know not the thoughts of Jehovah, neither understand they his counsel; for he hath gathered them together as the sheaves into the threshing-floor.
- Webster's Bible (WBS)
- But they know not the thoughts of the LORD, neither understand they his counsel: for he will gather them as sheaves into the floor.
- Young's Literal Translation (YLT)
- They have not known the thoughts of Jehovah, Nor have they understood His counsel, For He hath gathered them as a sheaf [into] a threshing-floor.
Read in context
- 10సీయోను కుమారీ, ప్రమాతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురమువరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును.
- 11మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడివచ్చి యున్నారు.
- 12కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవా వారిని సమ కూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొన కున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.
- 13సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతి ష్టించుదును.
Cross references
- Isaiah 55:8 యెషయా 55:8నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు
- Jeremiah 29:11 యిర్మీయా 29:11నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.
- Romans 11:33–34 రోమీయులకు 11:33–34ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
- Joel 3:12–13 యోవేలు 3:12–13నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి.
- Luke 3:17 లూకా 3:17ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.
- Zechariah 14:1–3 జెకర్యా 14:1–3ఇదిగో యెహోవా దినమువచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింప బడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవు చున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెర పట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.
- Revelation 14:14–20 ప్రకటన 14:14–20మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనపడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరుపండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను. మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను. మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.