Nahum · chapter 1 · verse 8
Nahum 1:8 in Telugu
ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,
Pralaya jalamuvale aayana aa purasthaanamunu nirmoolamucheyunu, tana shatruvulu andhakaaramulo diguvaraku aayana vaarini tarumunu,
Nahum 1:8 in English
- King James Version (KJV)
- But with an overrunning flood he will make an utter end of the place thereof, and darkness shall pursue his enemies.
- World English Bible (WEB)
- But with an overflowing flood, he will make a full end of her place, and will pursue his enemies into darkness.
- American Standard Version (ASV)
- But with an over-running flood he will make a full end of her place, and will pursue his enemies into darkness.
- Bible in Basic English (BBE)
- But like water overflowing he will take them away; he will put an end to those who come up against him, driving his haters into the dark.
- Darby Translation (DBY)
- But with an overrunning flood he will make a full end of the place thereof, and darkness shall pursue his enemies.
- Webster's Bible (WBS)
- But with an over-running flood he will make an utter end of the place thereof, and darkness shall pursue his enemies.
- Young's Literal Translation (YLT)
- And with a flood passing over, An end He maketh of its place, And His enemies doth darkness pursue.
Read in context
- 6ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
- 7యెహోవా ఉత్త ముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.
- 8ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,
- 9యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.
- 10ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.
Cross references
- Ezekiel 13:13 యెహెజ్కేలు 13:13ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నా కోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,
- Isaiah 28:17 యెషయా 28:17నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.
- Isaiah 8:22 యెషయా 8:22భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహ మైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.
- Zephaniah 2:13 జెఫన్యా 2:13ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.
- Amos 8:8 ఆమోసు 8:8ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.
- Job 30:15 యోబు 30:15భీకరమైనవి నామీద పడెను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘమువలె నా క్షేమము గతించిపోయెను.
- Amos 9:5–6 ఆమోసు 9:5–6ఆయన సైన్యములకధిపతి యగు యెహోవా; ఆయన భూమిని మొత్తగా అది కరిగి పోవును, అందులోని నివాసులందరును ప్రలాపింతురు, నైలునదివలెనే అదియంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలునదివలెనే అది అణగిపోవును. ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండల మునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.
- Nahum 1:1 నహూము 1:1నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.
- Matthew 8:12 మత్తయి 8:12రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Isaiah 8:7–8 యెషయా 8:7–8కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాప కము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.
- Matthew 7:27 మత్తయి 7:27వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
- 2 Peter 3:6–7 2 పేతురు 3:6–7ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.