Numbers · chapter 1 · verse 19
Numbers 1:19 in Telugu
యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.
Yehovaa ataniki aajnyaapinchinatlu seenaayi aranyamulo moshe vaarini lekkinchenu.
Numbers 1:19 in English
- King James Version (KJV)
- As the LORD commanded Moses, so he numbered them in the wilderness of Sinai.
- World English Bible (WEB)
- As the LORD commanded Moses, so he counted them in the wilderness of Sinai.
- American Standard Version (ASV)
- As Jehovah commanded Moses, so he numbered them in the wilderness of Sinai.
- Bible in Basic English (BBE)
- As the Lord had given orders to Moses, so they were numbered by him in the waste place of Sinai.
- Darby Translation (DBY)
- As Jehovah had commanded Moses, so he numbered them in the wilderness of Sinai.
- Webster's Bible (WBS)
- As the LORD commanded Moses, so he numbered them in the wilderness of Sinai.
- Young's Literal Translation (YLT)
- as Jehovah hath commanded Moses; and he numbereth them in the wilderness of Sinai.
Read in context
- 17పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహ రోనులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదిని సర్వ సమాజమును కూర్చెను.
- 18ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబ ములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
- 19యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.
- 20ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి.
- 21షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు
Cross references
- Numbers 1:2 సంఖ్యాకాండము 1:2ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.
- 2 Samuel 24:1–10 2 సమూయేలు 24:1–10ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీ యులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసినీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచిజనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్ర ములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబుజనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలిన వాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను. అయినను రాజు యోవా బునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుటచేత యోవాబును సైన్యాధిపతులును ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజుసముఖమునుండి బయలు వెళ్లి యొర్దాను నది దాటి యాజేరుతట్టున గాదు లోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడనుండి గిలాదునకును తహ్తింహోద్షీ దేశమునకును వచ్చిరి; తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణ మునకును హివ్వీయులయొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిదినెలల ఇరువది దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్ప గించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టు కొనగా అతడునేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా
- Numbers 26:1–2 సంఖ్యాకాండము 26:1–2ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషే కును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు కును ఈలాగు సెలవిచ్చెను మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి.