Numbers · chapter 1 · verse 2
Numbers 1:2 in Telugu
ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.
Ishraayeleeyula vanshamula choppuna vaari vaari pitarula kutumbamulanubatti vaari vaari peddalachoppuna magavaarinandarini lekkinchi sarvasamaajasankhyanu vraayinchumu.
Numbers 1:2 in English
- King James Version (KJV)
- Take ye the sum of all the congregation of the children of Israel, after their families, by the house of their fathers, with the number of [their] names, every male by their polls;
- World English Bible (WEB)
- “Take a census of all the congregation of the children of Israel, by their families, by their fathers’ houses, according to the number of the names, every male, one by one,
- American Standard Version (ASV)
- Take ye the sum of all the congregation of the children of Israel, by their families, by their fathers’ houses, according to the number of the names, every male, by their polls;
- Bible in Basic English (BBE)
- Take the full number of the children of Israel, by their families, and by their fathers' houses, every male by name;
- Darby Translation (DBY)
- Take the sum of the whole assembly of the children of Israel, after their families, according to their fathers' houses, by the number of the names, every male, according to their polls;
- Webster's Bible (WBS)
- Take ye the sum of all the congregation of the children of Israel, after their families by the house of their fathers, with the number of [their] names, every male by their poll:
- Young's Literal Translation (YLT)
- 'Take ye up the sum of all the company of the sons of Israel by their families, by the house of their fathers, in the number of names — every male by their polls;
Read in context
- 1వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవ త్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను
- 2ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.
- 3ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.
- 4మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను.
Cross references
- Exodus 30:12 నిర్గమకాండము 30:12వారు లెక్కింప బడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.
- Exodus 38:26 నిర్గమకాండము 38:26ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మందిలో తలకొకటికి అరతులము.
- Numbers 1:18 సంఖ్యాకాండము 1:18ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబ ములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
- Numbers 1:22 సంఖ్యాకాండము 1:22మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
- Numbers 26:2–4 సంఖ్యాకాండము 26:2–4మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రా యేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానము లలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.
- 1 Chronicles 27:23–24 1 దినవృత్తాంతములు 27:23–24ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు. జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.
- 2 Samuel 24:1–3 2 సమూయేలు 24:1–3ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీ యులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసినీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచిజనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్ర ములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబుజనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలిన వాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను.
- 1 Chronicles 21:1–2 1 దినవృత్తాంతములు 21:1–2తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనులయొక్క అధి పతులకునుమీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను.
- Exodus 1:1–5 నిర్గమకాండము 1:1–5ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను. దాను నఫ్తాలి గాదు ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
- Numbers 26:63–64 సంఖ్యాకాండము 26:63–64యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసి నప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండ లేదు.
- Genesis 49:1–3 ఆదికాండము 49:1–3యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరు కూడిరండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను. యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.
- Numbers 1:26–54 సంఖ్యాకాండము 1:26–54యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశ ము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగువేల నాలుగువందల మంది యైరి. జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మంది యైరి. యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్ర ములో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందల మంది యైరి. మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి. దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి. వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహ రోనును తమ తమ పితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్క డుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెనునీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు. ఇశ్రాయేలీ యుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణము లన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయు లను నియమింపుము. వారే మందిర మును దాని ఉపకర ణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసిన వారై యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.
Original words (Hebrew)
- Take · H5375נָשָׂא nâsâʼ
- sum · H7218רֹאשׁ rôʼsh
- congregation · H5712עֵדָה ʻêdâh
- children · H1121בֵּן bên
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- families · H4940מִשְׁפָּחָה mishpâchâh
- house · H1004בַּיִת bayith
- fathers · H1אָב ʼâb
- number · H4557מִסְפָּר miçpâr
- names · H8034שֵׁם shêm
- male · H2145זָכָר zâkâr
- polls · H1538גֻּלְגֹּלֶת gulgôleth