Numbers · chapter 10 · verse 18
Numbers 10:18 in Telugu
రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదే యూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
Roobeneeyula paalemu dhvajamu vaari senalachoppuna saagenu. Aa sainyamunaku shede yooru kumaarudaina eleesooru adhipati.
Numbers 10:18 in English
- King James Version (KJV)
- And the standard of the camp of Reuben set forward according to their armies: and over his host [was] Elizur the son of Shedeur.
- World English Bible (WEB)
- The standard of the camp of Reuben went forward according to their armies. Elizur the son of Shedeur was over his army.
- American Standard Version (ASV)
- And the standard of the camp of Reuben set forward according to their hosts: and over his host was Elizur the son of Shedeur.
- Bible in Basic English (BBE)
- Then the flag of the children of Reuben went forward with their armies: and at the head of his army was Elizur, the son of Shedeur.
- Darby Translation (DBY)
- And the standard of the camp of Reuben set forward according to their hosts, and over his host was Elizur the son of Shedeur;
- Webster's Bible (WBS)
- And the standard of the camp of Reuben moved forward according to their armies: and over his host [was] Elizur the son of Shedeur.
- Young's Literal Translation (YLT)
- And the standard of the camp of Reuben hath journeyed, by their hosts, and over its host [is] Elizur son of Shedeur.
Read in context
- 16జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.
- 17మందిరము విప్పబడి నప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి.
- 18రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదే యూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
- 19షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీ యేలు అధిపతి.
- 20గాదీయుల గోత్రసైన్యమునకు దెయు వేలు కుమారుడైన ఎలీయా సాపు అధిపతి.
Cross references
- Numbers 2:10–16 సంఖ్యాకాండము 2:10–16రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది. అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది. అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది. రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.
- Numbers 1:5 సంఖ్యాకాండము 1:5మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;
- Numbers 7:35 సంఖ్యాకాండము 7:35ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము.
- Numbers 26:5–18 సంఖ్యాకాండము 26:5–18ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు; పల్లువీయులు పల్లువంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు; వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది. పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీ యులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు; జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీ యులు షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది. గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు, ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీ యులు ఏరీ వంశస్థులు; ఆరోదీయులు ఆరోదు వంశ స్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు నలు బది వేల ఐదువందలమంది.