Numbers · chapter 18 · verse 31
Numbers 18:31 in Telugu
మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము.
Meerunu mee kutumbikulunu e sthalamandainanu daanini tinavachchunu; elayanagaa pratyakshapu gudaaramulo meeru cheyu sevaku adi meeku jeetamu.
Numbers 18:31 in English
- King James Version (KJV)
- And ye shall eat it in every place, ye and your households: for it [is] your reward for your service in the tabernacle of the congregation.
- World English Bible (WEB)
- You may eat it anywhere, you and your households, for it is your reward in return for your service in the Tent of Meeting.
- American Standard Version (ASV)
- And ye shall eat it in every place, ye and your households: for it is your reward in return for your service in the tent of meeting.
- Bible in Basic English (BBE)
- It is to be your food, for you and your families in every place: it is your reward for your work in the Tent of meeting.
- Darby Translation (DBY)
- And ye shall eat it in every place, ye and your households; for it is your reward for your service in the tent of meeting.
- Webster's Bible (WBS)
- And ye shall eat it in every place, ye and your households: for it [is] your reward for your service in the tabernacle of the congregation.
- Young's Literal Translation (YLT)
- and ye have eaten it in every place, ye and your households, for it [is] your hire in exchange for your service in the tent of meeting;
Read in context
- 29మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను.
- 30మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగ మును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.
- 31మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము.
- 32మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాప శిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీ యుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.
Cross references
- 1 Corinthians 9:10–14 1 కొరింథీయులకు 9:10–14కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నా రనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా? ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువునియమించియున్నాడు.
- Luke 10:7 లూకా 10:7వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటిం టికి తిరుగవద్దు.
- 1 Timothy 5:17–18 1 తిమోతికి 5:17–18బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్య మందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది.
- Matthew 10:10 మత్తయి 10:10పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?
- Deuteronomy 14:22–23 ద్వితీయోపదేశకాండము 14:22–23ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినము లన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామము నకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ పంతును, నీ పశువులలోగాని గొఱ్ఱె మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను.
- 2 Corinthians 12:13 2 కొరింథీయులకు 12:13నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి.
- Galatians 6:6 గలతీయులకు 6:6వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను.