Numbers · chapter 18 · verse 9
Numbers 18:9 in Telugu
అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరి శుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.
Agnilo dahimpabadani ati parishuddhamaina vaatilo neeku raavalasinavevanagaa, vaari naivedyamulannitilonu, vaari paapaparihaaraartha balulanni tilonu, vaari aparaadha parihaaraartha balulannitilonu vaaru naaku tirigi chellinchu arpanamulanniyu neekunu nee kumaarulakunu atiparishuddhamainavagunu, atipari shuddhasthalamulo meeru vaatini tinavalenu.
Numbers 18:9 in English
- King James Version (KJV)
- This shall be thine of the most holy things, [reserved] from the fire: every oblation of theirs, every meat offering of theirs, and every sin offering of theirs, and every trespass offering of theirs, which they shall render unto me, [shall be] most holy for thee and for thy sons.
- World English Bible (WEB)
- This shall be yours of the most holy things from the fire: every offering of theirs, even every meal offering of theirs, and every sin offering of theirs, and every trespass offering of theirs, which they shall give to me, shall be most holy for you and for your sons.
- American Standard Version (ASV)
- This shall be thine of the most holy things, [reserved] from the fire: every oblation of theirs, even every meal-offering of theirs, and every sin-offering of theirs, and every trespass-offering of theirs, which they shall render unto me, shall be most holy for thee and for thy sons.
- Bible in Basic English (BBE)
- This is to be yours of the most holy things, out of the fire offerings; every offering of theirs, every meal offering and sin-offering, and every offering which they make on account of error, is to be most holy for you and your sons.
- Darby Translation (DBY)
- This shall be thine of the most holy things, [reserved] from the fire: every offering of theirs, of all their oblations, and of all their sin-offerings, and of all their trespass-offerings, which they render unto me, it is most holy for thee and for thy sons.
- Webster's Bible (WBS)
- This shall be thine of the most holy things [reserved] from the fire: every oblation of theirs, every meat-offering of theirs, and every sin-offering of theirs, and every trespass-offering of theirs, which they shall render to me, [shall be] most holy for thee and for thy sons.
- Young's Literal Translation (YLT)
- This is thine of the most holy things, from the fire: all their offering, to all their present, and to all their sin-offering, and to all their guilt-offering, which they give back to Me, is most holy to thee, and to thy sons;
Read in context
- 7కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపుసేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.
- 8మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనుఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చి యున్నాను; అభి షేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.
- 9అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరి శుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.
- 10ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.
- 11మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును.
Cross references
- Leviticus 7:7 లేవీయకాండము 7:7పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును.
- Leviticus 14:13 లేవీయకాండము 14:13అతడు పాపపరి హారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైనదానివలె అపరాధపరి హారార్థ మైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.
- Leviticus 6:25–26 లేవీయకాండము 6:25–26నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుముపాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలిరూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతి పరిశుద్ధము. పాపపరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరి శుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.
- Leviticus 4:22 లేవీయకాండము 4:22అధికారి పొరబాటున పాపముచేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల
- Leviticus 5:1 లేవీయకాండము 5:1ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియై యుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును.
- Leviticus 4:27 లేవీయకాండము 4:27మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరానిపనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల
- Leviticus 7:1 లేవీయకాండము 7:1అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా
- Leviticus 10:17 లేవీయకాండము 10:17మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలిపశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధముగదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.
- Leviticus 2:1–3 లేవీయకాండము 2:1–3ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలి పీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమ ములలో అది అతిపరిశుద్ధము.
- Leviticus 10:12–13 లేవీయకాండము 10:12–13అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్ల నెనుమీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్య మును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు. కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.
- Leviticus 5:6 లేవీయకాండము 5:6తాను చేసిన పాపవిషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱెపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేయును.