Numbers · chapter 20 · verse 2
Numbers 20:2 in Telugu
ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.
Aa samaajamunaku neellu lekapoyinanduna vaaru moshe aharonulaku virodhamugaa pogairi.
Numbers 20:2 in English
- King James Version (KJV)
- And there was no water for the congregation: and they gathered themselves together against Moses and against Aaron.
- World English Bible (WEB)
- There was no water for the congregation; and they assembled themselves together against Moses and against Aaron.
- American Standard Version (ASV)
- And there was no water for the congregation: and they assembled themselves together against Moses and against Aaron.
- Bible in Basic English (BBE)
- And there was no water for the people: and they came together against Moses and against Aaron.
- Darby Translation (DBY)
- And there was no water for the assembly, and they gathered themselves together against Moses and against Aaron.
- Webster's Bible (WBS)
- And there was no water for the congregation: and they assembled themselves against Moses and against Aaron.
- Young's Literal Translation (YLT)
- And there hath been no water for the company, and they are assembled against Moses, and against Aaron,
Read in context
- 1మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమా జము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.
- 2ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.
- 3జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోద రులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు
- 4అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి?
Cross references
- Numbers 16:19 సంఖ్యాకాండము 16:19కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధ ముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజ మునకు కనబడెను.
- Numbers 16:42 సంఖ్యాకాండము 16:42సమాజము మోషే అహరోను లకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను.
- Exodus 15:23–24 నిర్గమకాండము 15:23–24మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు - మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా
- Numbers 21:5 సంఖ్యాకాండము 21:5కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.
- Exodus 16:7 నిర్గమకాండము 16:7యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి.
- 1 Corinthians 10:10–11 1 కొరింథీయులకు 10:10–11మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
- Exodus 16:12 నిర్గమకాండము 16:12నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.
- Numbers 16:3 సంఖ్యాకాండము 16:3మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిమీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,
- Exodus 16:2 నిర్గమకాండము 16:2ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను.
- Exodus 17:1–4 నిర్గమకాండము 17:1–4తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే - మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషే మీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు - ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను.
- Numbers 11:1–6 సంఖ్యాకాండము 11:1–6జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధి కముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చిమాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.