Numbers · chapter 21 · verse 35
Numbers 21:35 in Telugu
కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీన పరచుకొనిరి.
Kaabatti vaaru atanini atani kumaarulanu ataniki okkadainanu sheshinchakunda atani samasta janamunu hatamuchesi atani deshamunu svaadheena parachukoniri.
Numbers 21:35 in English
- King James Version (KJV)
- So they smote him, and his sons, and all his people, until there was none left him alive: and they possessed his land.
- World English Bible (WEB)
- So they struck him, with his sons and all his people, until there were no survivors; and they possessed his land.
- American Standard Version (ASV)
- So they smote him, and his sons and all his people, until there was none left him remaining: and they possessed his land.
- Bible in Basic English (BBE)
- So they overcame him and his sons and his people, driving them all out: and they took his land for their heritage.
- Darby Translation (DBY)
- And they smote him, and his sons, and all his people, so that they left him none remaining, and took possession of his land.
- Webster's Bible (WBS)
- So they smote him, and his sons, and all his people, until there was none left to him alive: and they possessed his land.
- Young's Literal Translation (YLT)
- And they smite him, and his sons, and all his people, until he hath not left to him a remnant, and they possess his land.
Read in context
- 33వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా
- 34యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు.
- 35కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీన పరచుకొనిరి.
Cross references
- Deuteronomy 3:3–17 ద్వితీయోపదేశకాండము 3:3–17అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియు లేకుండ అతనిని హతము చేసితివిు. ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియు లేదు. బాషానులో ఓగురాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి. ఆ పురములన్నియు గొప్ప ప్రాకార ములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టు కొంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితివిు; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితివిు; వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసి కొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి. సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమో రీయులు దానిని శెనీరని అందురు. మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషా నును పట్టుకొంటిమి. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు. అర్నోను లోయలో నున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశ మును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఓగు రాజు దేశమైన బాషాను యావ త్తును గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంత టిని మనష్షే అర్ధ గోత్రమున కిచ్చితిని. మనష్షే కుమారు డైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయా కాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరీయులకు గిలాదు నిచ్చితిని. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీ యులకును గాదీయులకును ఇచ్చితిని.
- Joshua 13:12 యెహోషువ 13:12రెఫాయీయుల శేషములో అష్తారోతు లోను ఎద్రెయీలోను ఏలికయైన ఓగురాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను.
- Deuteronomy 29:7–8 ద్వితీయోపదేశకాండము 29:7–8మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశ మును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయుల కును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితివిు.
- Joshua 12:4–6 యెహోషువ 12:4–6ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగుదేశమును పట్టు కొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీ యుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరి హద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.
- Psalm 135:10–12 కీర్తనలు 135:10–12అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీయుల రాజైన ఓగును హతముచేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను.
- Romans 8:37 రోమీయులకు 8:37అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
- Psalm 136:17–21 కీర్తనలు 136:17–21గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.