Numbers · chapter 4 · verse 18
Numbers 4:18 in Telugu
మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి.
Meeru kahaateeyula gotra kutumbamulanu leveeyulalonundi pratyekimpakudi.
Numbers 4:18 in English
- King James Version (KJV)
- Cut ye not off the tribe of the families of the Kohathites from among the Levites:
- World English Bible (WEB)
- “Don’t cut off the tribe of the families of the Kohathites from among the Levites;
- American Standard Version (ASV)
- Cut ye not off the tribe of the families of the Kohathites from among the Levites;
- Bible in Basic English (BBE)
- Do not let the family of the Kohathites be cut off from among the Levites;
- Darby Translation (DBY)
- Ye shall not cut off the families of the Kohathites from among the Levites,
- Webster's Bible (WBS)
- Cut ye not off the tribe of the families of the Kohathites from among the Levites:
- Young's Literal Translation (YLT)
- 'Ye do not cut off the tribe of the families of the Kohathite from the midst of the Levites;
Read in context
- 16యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగాదీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము.
- 17మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
- 18మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి.
- 19వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను.
- 20వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.
Cross references
- Exodus 19:21 నిర్గమకాండము 19:21అప్పుడు యెహోవాప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము.
- 2 Samuel 6:6–7 2 సమూయేలు 6:6–7వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.
- Numbers 17:10 సంఖ్యాకాండము 17:10అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుతిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.
- Numbers 18:5 సంఖ్యాకాండము 18:5అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడ వలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.
- Jeremiah 38:23 యిర్మీయా 38:23నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.
- Leviticus 10:1–2 లేవీయకాండము 10:1–2అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.
- 1 Samuel 6:19 1 సమూయేలు 6:19బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖా క్రాంతులైరి.
- Numbers 16:32 సంఖ్యాకాండము 16:32భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.