Proverbs · chapter 17 · verse 16
Proverbs 17:16 in Telugu
బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా?
Buddhiheenuni chetilo jnyaanamu sampaadinchutaku sommunda nela? Vaaniki buddhi ledu gadaa?
Proverbs 17:16 in English
- King James Version (KJV)
- Wherefore [is there] a price in the hand of a fool to get wisdom, seeing [he hath] no heart [to it]?
- World English Bible (WEB)
- Why is there money in the hand of a fool to buy wisdom, since he has no understanding?
- American Standard Version (ASV)
- Wherefore is there a price in the hand of a fool to buy wisdom, Seeing he hath no understanding?
- Bible in Basic English (BBE)
- How will money in the hand of the foolish get him wisdom, seeing that he has no sense?
- Darby Translation (DBY)
- To what purpose is there a price in the hand of a fool to get wisdom, seeing [he] hath no sense?
- Webster's Bible (WBS)
- Why [is there] a price in the hand of a fool to get wisdom, seeing [he hath] no heart [to it] ?
- Young's Literal Translation (YLT)
- Why [is] this — a price in the hand of a fool to buy wisdom, And a heart there is none?
Read in context
- 14కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు
- 15నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు.
- 16బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా?
- 17నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
- 18తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.
Cross references
- Proverbs 21:25–26 సామెతలు 21:25–26సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును. దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.
- Proverbs 23:23 సామెతలు 23:23సత్యమును అమ్మివేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు కొనుము.
- Proverbs 8:4–5 సామెతలు 8:4–5మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.
- Acts 28:26–27 అపొస్తలుల కార్యములు 28:26–27మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.
- Deuteronomy 5:29 ద్వితీయోపదేశకాండము 5:29వారికిని వారి సంతాన మునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.
- Proverbs 18:15 సామెతలు 18:15జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.
- 2 Corinthians 6:1 2 కొరింథీయులకు 6:1కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.
- Isaiah 55:1–3 యెషయా 55:1–3దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
- Acts 13:46 అపొస్తలుల కార్యములు 13:46అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరిదేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్య కమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము
- Proverbs 1:22–23 సామెతలు 1:22–23ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు? నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను.
- Proverbs 9:4–6 సామెతలు 9:4–6జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించు చున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
- Psalm 81:11–13 కీర్తనలు 81:11–13అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు కొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు!