Proverbs · chapter 2 · verse 4
Proverbs 2:4 in Telugu
వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల
Vendini vedakinatlu daani vedakina yedala daachabadina dhanamunu vedakinatlu daani vedakina yedala
Proverbs 2:4 in English
- King James Version (KJV)
- If thou seekest her as silver, and searchest for her as [for] hid treasures;
- World English Bible (WEB)
- if you seek her as silver, and search for her as for hidden treasures;
- American Standard Version (ASV)
- If thou seek her as silver, And search for her as for hid treasures:
- Bible in Basic English (BBE)
- If you are looking for her as for silver, and searching for her as for stored-up wealth;
- Darby Translation (DBY)
- if thou seekest her as silver and searchest for her as for hidden treasures:
- Webster's Bible (WBS)
- If thou seekest her as silver, and searchest for her as [for] hid treasures;
- Young's Literal Translation (YLT)
- If thou dost seek her as silver, And as hid treasures searchest for her,
Read in context
- 2జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల
- 3తెలివికై మొఱ్ఱపెట్టిన యెడల వివేచనకై మనవి చేసినయెడల
- 4వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల
- 5యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
- 6యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.
Cross references
- Matthew 13:44 మత్తయి 13:44పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును.
- Proverbs 16:16 సామెతలు 16:16అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.
- Matthew 19:29 మత్తయి 19:29నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.
- Job 3:21 యోబు 3:21వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది.
- Job 28:12–20 యోబు 28:12–20అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది? నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును. సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
- Proverbs 8:18–19 సామెతలు 8:18–19ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి. మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.
- Proverbs 3:14–15 సామెతలు 3:14–15వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
- Psalm 119:14 కీర్తనలు 119:14సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను.
- Psalm 119:72 కీర్తనలు 119:72వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.
- Psalm 119:127 కీర్తనలు 119:127బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి.
- Luke 16:8 లూకా 16:8అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు
- Matthew 19:21–22 మత్తయి 19:21–22అందుకు యేసు–నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ ¸యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను.