Proverbs · chapter 20 · verse 22
Proverbs 20:22 in Telugu
కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.
Keeduku pratikeedu chesedananukonavaddu yehovaakoraku kanipettukonumu aayana ninnu rakshinchunu.
Proverbs 20:22 in English
- King James Version (KJV)
- Say not thou, I will recompense evil; [but] wait on the LORD, and he shall save thee.
- World English Bible (WEB)
- Don’t say, “I will pay back evil.” Wait for the LORD, and he will save you.
- American Standard Version (ASV)
- Say not thou, I will recompense evil: Wait for Jehovah, and he will save thee.
- Bible in Basic English (BBE)
- Do not say, I will give punishment for evil: go on waiting for the Lord, and he will be your saviour.
- Darby Translation (DBY)
- Say not, I will recompense evil: wait on Jehovah, and he shall save thee.
- Webster's Bible (WBS)
- Say not thou, I will recompense evil; [but] wait on the LORD, and he shall save thee.
- Young's Literal Translation (YLT)
- Do not say, 'I recompense evil,' Wait for Jehovah, and He delivereth thee.
Read in context
- 20తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.
- 21మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.
- 22కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.
- 23వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.
- 24ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?
Cross references
- Romans 12:17–19 రోమీయులకు 12:17–19కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
- 1 Thessalonians 5:15 1 థెస్సలొనీకయులకు 5:15ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.
- Proverbs 24:29 సామెతలు 24:29వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదననుకొనకుము.
- Proverbs 17:13 సామెతలు 17:13మేలుకు ప్రతిగా కీడు చేయువాని యింటనుండి కీడు తొలగిపోదు.
- 1 Peter 3:9 1 పేతురు 3:9ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
- Deuteronomy 32:35 ద్వితీయోపదేశకాండము 32:35వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.
- 1 Peter 2:23 1 పేతురు 2:23ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
- Matthew 5:39 మత్తయి 5:39నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
- 1 Peter 4:19 1 పేతురు 4:19కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
- Lamentations 3:25–26 విలాపవాక్యములు 3:25–26తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
- Psalm 37:34 కీర్తనలు 37:34యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
- Psalm 27:14 కీర్తనలు 27:14ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.