Proverbs · chapter 20 · verse 26
Proverbs 20:26 in Telugu
జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.
Jnyaanamugala raaju bhaktiheenulanu chedaragottunu vaarimeeda chakramu dorlinchunu.
Proverbs 20:26 in English
- King James Version (KJV)
- A wise king scattereth the wicked, and bringeth the wheel over them.
- World English Bible (WEB)
- A wise king winnows out the wicked, and drives the threshing wheel over them.
- American Standard Version (ASV)
- A wise king winnoweth the wicked, And bringeth the [threshing]-wheel over them.
- Bible in Basic English (BBE)
- A wise king puts evil-doers to flight, and makes their evil-doing come back on them.
- Darby Translation (DBY)
- A wise king scattereth the wicked, and bringeth the wheel over them.
- Webster's Bible (WBS)
- A wise king scatterreth the wicked, and bringeth the wheel over them.
- Young's Literal Translation (YLT)
- A wise king is scattering the wicked, And turneth back on them the wheel.
Read in context
- 24ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?
- 25వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును.
- 26జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.
- 27నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.
- 28కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును.
Cross references
- Proverbs 20:8 సామెతలు 20:8న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.
- 2 Samuel 12:31 2 సమూయేలు 12:31పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదును గల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.
- 2 Samuel 4:9–12 2 సమూయేలు 4:9–12దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను మంచి వర్తమానము తెచ్చితినని తలంచియొకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి, అతని మంచము మీదనే నిర్దోషియగువానిని చంపినప్పుడు మీచేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదునా? లోకములో ఉండకుండ నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి, దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలనుదగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసికొనిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతి పెట్టిరి.
- Psalm 101:5–8 కీర్తనలు 101:5–8తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు. యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.
- Isaiah 28:27–28 యెషయా 28:27–28సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్ల గొట్టును గదా? మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా? సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుఱ్ఱములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా!