Proverbs · chapter 24 · verse 17
Proverbs 24:17 in Telugu
నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.
Nee shatruvu padinappudu santoshimpakumu vaadu totrillinappudu neevu manassuna nullasimpakumu.
Proverbs 24:17 in English
- King James Version (KJV)
- Rejoice not when thine enemy falleth, and let not thine heart be glad when he stumbleth:
- World English Bible (WEB)
- Don’t rejoice when your enemy falls. Don’t let your heart be glad when he is overthrown,
- American Standard Version (ASV)
- Rejoice not when thine enemy falleth, And let not thy heart be glad when he is overthrown;
- Bible in Basic English (BBE)
- Do not be glad at the fall of your hater, and let not your heart have joy at his downfall:
- Darby Translation (DBY)
- Rejoice not when thine enemy falleth, and let not thy heart be glad when he stumbleth;
- Webster's Bible (WBS)
- Rejoice not when thy enemy falleth, and let not thy heart be glad when he stumbleth:
- Young's Literal Translation (YLT)
- In the falling of thine enemy rejoice not, And in his stumbling let not thy heart be joyful,
Read in context
- 15భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.
- 16నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.
- 17నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.
- 18యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.
- 19దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.
Cross references
- Obadiah 1:12 ఓబద్యా 1:12నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశన దినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు;
- Job 31:29 యోబు 31:29నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
- 1 Corinthians 13:6–7 1 కొరింథీయులకు 13:6–7దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
- Proverbs 17:5 సామెతలు 17:5బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించు వాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు.
- 2 Samuel 16:5–14 2 సమూయేలు 16:5–14రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను. ఈ షిమీనరహంతకుడా, దుర్మార్గుడా ఛీపో, ఛీపో, నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి యున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా సెరూయా కుమారుడైన అబీషైఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను. అందుకు రాజుసెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగానీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగానా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వానిజోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను. రాజును అతనితోకూడనున్న జనులందరును బడలినవారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి.
- Psalm 42:10 కీర్తనలు 42:10నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచు చున్నారు.
- Psalm 35:19 కీర్తనలు 35:19నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీటనియ్యకుము.
- Psalm 35:15 కీర్తనలు 35:15నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.
- Judges 16:25 న్యాయాధిపతులు 16:25వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారుమనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువ బెట్టి పరిహాసముచేయగా