Proverbs · chapter 27 · verse 22
Proverbs 27:22 in Telugu
మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.
Moodhuni rotiloni godhumalalo vesi rokata danchinanu vaani moodhata vaani vadalipodu.
Proverbs 27:22 in English
- King James Version (KJV)
- Though thou shouldest bray a fool in a mortar among wheat with a pestle, [yet] will not his foolishness depart from him.
- World English Bible (WEB)
- Though you grind a fool in a mortar with a pestle along with grain, yet his foolishness will not be removed from him.
- American Standard Version (ASV)
- Though thou shouldest bray a fool in a mortar with a pestle along with bruised grain, Yet will not his foolishness depart from him.
- Bible in Basic English (BBE)
- Even if a foolish man is crushed with a hammer in a vessel among crushed grain, still his foolish ways will not go from him.
- Darby Translation (DBY)
- If thou shouldest bray a fool in a mortar among wheat with a pestle, yet will not his folly depart from him.
- Webster's Bible (WBS)
- Though thou shouldst bray a fool in a mortar among wheat with a pestle, [yet] his foolishness will not depart from him.
- Young's Literal Translation (YLT)
- If thou dost beat the foolish in a mortar, Among washed things — with a pestle, His folly turneth not aside from off him.
Read in context
- 20పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానే రదు ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు.
- 21మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.
- 22మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.
- 23నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.
- 24ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?
Cross references
- Proverbs 23:35 సామెతలు 23:35నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.
- Jeremiah 5:3 యిర్మీయా 5:3యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.
- Isaiah 1:5 యెషయా 1:5నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
- Revelation 16:10–11 ప్రకటన 16:10–11అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు.
- Exodus 12:30 నిర్గమకాండము 12:30ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
- Jeremiah 44:15–16 యిర్మీయా 44:15–16అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును, మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,
- Exodus 14:5 నిర్గమకాండము 14:5ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్ప బడి మనమెందుకీలాగు చేసితివిు? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితివిు అని చెప్పుకొనిరి.
- Exodus 15:9 నిర్గమకాండము 15:9తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను.
- 2 Chronicles 28:22–23 2 దినవృత్తాంతములు 28:22–23ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధిక ముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగాసిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదనను కొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.