Proverbs · chapter 27 · verse 23
Proverbs 27:23 in Telugu
నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.
Nee pashuvula sthiti jaagrattagaa telisikonumu nee mandalayandu manassu unchumu.
Proverbs 27:23 in English
- King James Version (KJV)
- Be thou diligent to know the state of thy flocks, [and] look well to thy herds.
- World English Bible (WEB)
- Know well the state of your flocks, and pay attention to your herds,
- American Standard Version (ASV)
- Be thou diligent to know the state of thy flocks, [And] look well to thy herds:
- Bible in Basic English (BBE)
- Take care to have knowledge about the condition of your flocks, looking well after your herds;
- Darby Translation (DBY)
- Be well acquainted with the appearance of thy flocks; look well to thy herds:
- Webster's Bible (WBS)
- Be thou diligent to know the state of thy flocks, [and] look well to thy herds.
- Young's Literal Translation (YLT)
- Know well the face of thy flock, Set thy heart to the droves,
Read in context
- 21మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.
- 22మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.
- 23నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.
- 24ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?
- 25ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడు చున్నది కొండగడ్డి యేరబడియున్నది
Cross references
- 1 Peter 5:2 1 పేతురు 5:2బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.
- John 21:15–17 యోహాను 21:15–17వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడిప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.
- Genesis 33:13 ఆదికాండము 33:13అతడునాయొద్ద నున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును.
- 2 Chronicles 26:10 2 దినవృత్తాంతములు 26:10అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వత ములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి.
- Ezekiel 34:31 యెహెజ్కేలు 34:31నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- Proverbs 24:32 సామెతలు 24:32నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.
- Ezekiel 34:22–24 యెహెజ్కేలు 34:22–24నా గొఱ్ఱెలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱె కును గొఱ్ఱెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.
- John 10:3 యోహాను 10:3అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.
- 1 Chronicles 27:29–31 1 దినవృత్తాంతములు 27:29–31షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీ యుడైన యెహెద్యాహును నియమింపబడిరి. గొఱ్ఱెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజుకున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు.
- Deuteronomy 32:46 ద్వితీయోపదేశకాండము 32:46మరల వారితో ఇట్లనెనుమీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మన స్సులలో పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారి కాజ్ఞాపింపవలెను.
- Genesis 31:38–40 ఆదికాండము 31:38–40ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱెలైనను మేకలైనను ఈచు కొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని. పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూరమాయెను.
- 1 Samuel 17:28 1 సమూయేలు 17:28అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.