Proverbs · chapter 30 · verse 9
Proverbs 30:9 in Telugu
ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో.
Ekkuvainayedala nenu kadupu nindinavaadanai ninnu visarjinchi yehovaa yevadani andunemo leka beedanai dongili naa devuni naamamunu dooshintu nemo.
Proverbs 30:9 in English
- King James Version (KJV)
- Lest I be full, and deny [thee], and say, Who [is] the LORD? or lest I be poor, and steal, and take the name of my God [in vain].
- World English Bible (WEB)
- lest I be full, deny you, and say, ‘Who is the LORD?’ or lest I be poor, and steal, and so dishonor the name of my God.
- American Standard Version (ASV)
- Lest I be full, and deny [thee], and say, Who is Jehovah? Or lest I be poor, and steal, And use profanely the name of my God.
- Bible in Basic English (BBE)
- For fear that if I am full, I may be false to you and say, Who is the Lord? or if I am poor, I may become a thief, using the name of my God wrongly.
- Darby Translation (DBY)
- lest I be full and deny [thee], and say, Who is Jehovah? or lest I be poor and steal, and outrage the name of my God.
- Webster's Bible (WBS)
- Lest I be full, and deny [thee] , and say, Who [is] the LORD? or lest I be poor, and steal, and take the name of my God [in vain] .
- Young's Literal Translation (YLT)
- Lest I become satiated, and have denied, And have said, 'Who [is] Jehovah?' And lest I be poor, and have stolen, And have laid hold of the name of my God.
Read in context
- 7దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము;
- 8వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.
- 9ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో.
- 10దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు.
- 11తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.
Cross references
- Hosea 13:6 హోషేయ 13:6తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.
- Deuteronomy 31:20 ద్వితీయోపదేశకాండము 31:20నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారు తిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.
- Ezekiel 16:49–50 యెహెజ్కేలు 16:49–50నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని.
- Deuteronomy 8:10–14 ద్వితీయోపదేశకాండము 8:10–14నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్థిల్లినప్పుడు నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.
- Deuteronomy 32:15 ద్వితీయోపదేశకాండము 32:15యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.
- Nehemiah 9:25–26 నెహెమ్యా 9:25–26అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణ ములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగున వారు తిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.
- Job 31:24–28 యోబు 31:24–28సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును. అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
- Deuteronomy 6:10–12 ద్వితీయోపదేశకాండము 6:10–12నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావు లను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.
- Jeremiah 2:31 యిర్మీయా 2:31ఈ తరమువార లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడినేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?
- Exodus 20:7 నిర్గమకాండము 20:7నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు.
- Joshua 24:27 యెహోషువ 24:27జను లందరితో ఇట్లనెనుఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీమీద సాక్షిగా ఉండును.
- Matthew 26:72 మత్తయి 26:72అతడు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.