Psalms · chapter 102 · verse 16
Psalm 102:16 in Telugu
ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
Elayanagaa yehovaa seeyonunu kattiyunnaadu aayana tana mahimato pratyakshamaayenu
Psalm 102:16 in English
- King James Version (KJV)
- When the LORD shall build up Zion, he shall appear in his glory.
- World English Bible (WEB)
- For the LORD has built up Zion. He has appeared in his glory.
- American Standard Version (ASV)
- For Jehovah hath built up Zion; He hath appeared in his glory.
- Bible in Basic English (BBE)
- When the Lord has put up the walls of Zion, and has been been in his glory;
- Darby Translation (DBY)
- When Jehovah shall build up Zion, he will appear in his glory.
- Webster's Bible (WBS)
- When the LORD shall build up Zion, he will appear in his glory.
- Young's Literal Translation (YLT)
- For Jehovah hath builded Zion, He hath been seen in His honour,
Read in context
- 14దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు
- 15అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు
- 16ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
- 17ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
- 18యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు
Cross references
- Isaiah 60:1–2 యెషయా 60:1–2నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
- Jeremiah 33:7 యిర్మీయా 33:7చెరలో నుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించు చున్నాను.
- Psalm 147:2 కీర్తనలు 147:2యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు
- Isaiah 2:2–3 యెషయా 2:2–3అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
- Zechariah 2:6–13 జెకర్యా 2:6–13ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకా శపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు. బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు. సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచు కొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసు లకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసి కొందురు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించు కొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి.
- Jeremiah 31:4 యిర్మీయా 31:4ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.
- Isaiah 66:18 యెషయా 66:18వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట లాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు.
- Isaiah 60:7 యెషయా 60:7నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
- Micah 2:9 మీకా 2:9వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డల యొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడును లేకుండ మీరు ఎత్తికొని పోవుదురు.
- Psalm 97:6 కీర్తనలు 97:6ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది
- Psalm 69:35 కీర్తనలు 69:35దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.
- Isaiah 14:26 యెషయా 14:26సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే.