Psalms · chapter 108 · verse 6
Psalm 108:6 in Telugu
నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లుn నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము.
Nee prabhaavamu sarvabhoomimeeda kanabadanimmu nee priyulu vimochimpabadunatlun nee kudichetito nannu rakshinchi naaku uttaramimmu.
Psalm 108:6 in English
- King James Version (KJV)
- That thy beloved may be delivered: save [with] thy right hand, and answer me.
- World English Bible (WEB)
- That your beloved may be delivered, save with your right hand, and answer us.
- American Standard Version (ASV)
- That thy beloved may be delivered, Save with thy right hand, and answer us.
- Bible in Basic English (BBE)
- Let your right hand be stretched out for salvation, and give me an answer, so that your loved ones may be safe from danger.
- Darby Translation (DBY)
- That thy beloved ones may be delivered: save with thy right hand, and answer me.
- Webster's Bible (WBS)
- That thy beloved may be delivered: save [with] thy right hand, and answer me.
- Young's Literal Translation (YLT)
- That Thy beloved ones may be delivered, Save [with] Thy right hand, and answer us.
Read in context
- 4యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది.
- 5దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము.
- 6నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లుn నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము.
- 7తన పరిశుద్ధత తోడని దేవుడు మాట యిచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.
- 8గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజ దండము.
Cross references
- 2 Chronicles 32:20–22 2 దినవృత్తాంతములు 32:20–22రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవునిగుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున
- Psalm 60:5–12 కీర్తనలు 60:5–12నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము తన పరిశుద్ధతతోడని దేవుడు మాట యిచ్చి యున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావు గదా? మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.
- Colossians 3:12 కొలొస్సయులకు 3:12కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.
- Deuteronomy 33:12 ద్వితీయోపదేశకాండము 33:12బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య అతడు నివసించును
- Ephesians 1:6 ఎఫెసీయులకు 1:6మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
- Psalm 35:1–3 కీర్తనలు 35:1–3యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.
- Psalm 54:1 కీర్తనలు 54:1దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.
- Matthew 17:5 మత్తయి 17:5అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
- 1 Kings 18:24 1 రాజులు 18:24తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరునుఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి.
- Matthew 3:17 మత్తయి 3:17మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
- Isaiah 51:2–11 యెషయా 51:2–11మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా? అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా? యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.
- Jeremiah 33:3 యిర్మీయా 33:3నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.