Psalms · chapter 110 · verse 2
Psalm 110:2 in Telugu
యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.
Yehovaa nee paripaalanadandamunu seeyonulonundi saagajeyuchunnaadu nee shatruvulamadhyanu neevu paripaalana cheyumu.
Psalm 110:2 in English
- King James Version (KJV)
- The LORD shall send the rod of thy strength out of Zion: rule thou in the midst of thine enemies.
- World English Bible (WEB)
- The LORD will send out the rod of your strength out of Zion. Rule among your enemies.
- American Standard Version (ASV)
- Jehovah will send forth the rod of thy strength out of Zion: Rule thou in the midst of thine enemies.
- Bible in Basic English (BBE)
- The Lord will send out the rod of your strength from Zion; be king over your haters.
- Darby Translation (DBY)
- Jehovah shall send the sceptre of thy might out of Zion: rule in the midst of thine enemies.
- Webster's Bible (WBS)
- The LORD will send the rod of thy strength out of Zion: rule thou in the midst of thy enemies.
- Young's Literal Translation (YLT)
- The rod of thy strength doth Jehovah send from Zion, Rule in the midst of thine enemies.
Read in context
- 1ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
- 2యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.
- 3యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ¸యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు
- 4మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.
Cross references
- Jeremiah 48:17 యిర్మీయా 48:17దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి దాని కీర్తినిగూర్చి విననివారలారా, అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము విరిగిపోయెనే యని చెప్పుకొనుడి.
- 2 Corinthians 10:4–5 2 కొరింథీయులకు 10:4–5మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి. మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
- Matthew 28:18–20 మత్తయి 28:18–20అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
- Psalm 45:5–6 కీర్తనలు 45:5–6నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.
- Psalm 2:8–9 కీర్తనలు 2:8–9నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
- Psalm 72:8 కీర్తనలు 72:8సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.
- Acts 2:34–37 అపొస్తలుల కార్యములు 2:34–37దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా
- 1 Corinthians 1:23–24 1 కొరింథీయులకు 1:23–24అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.
- Micah 4:2 మీకా 4:2కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తనమార్గములవిషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.
- 1 Thessalonians 2:13 1 థెస్సలొనీకయులకు 2:13ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
- Ezekiel 19:14 యెహెజ్కేలు 19:14దాని పండ్లను దహించుచున్నది గనుక రాజ దండమునకు తగిన గట్టిచువ్వ యొకటియు విడువబడ లేదు. ఇదియే ప్రలాపవాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును.
- Romans 1:16 రోమీయులకు 1:16సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.