Psalms · chapter 115 · verse 15
Psalm 115:15 in Telugu
భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.
Bhoomyaakaashamulanu srujinchina yehovaacheta meeru aasheervadimpabadinavaaru.
Psalm 115:15 in English
- King James Version (KJV)
- Ye [are] blessed of the LORD which made heaven and earth.
- World English Bible (WEB)
- Blessed are you by the LORD, who made heaven and earth.
- American Standard Version (ASV)
- Blessed are ye of Jehovah, Who made heaven and earth.
- Bible in Basic English (BBE)
- May you have the blessing of the Lord, who made heaven and earth.
- Darby Translation (DBY)
- Ye are blessed of Jehovah, who made the heavens and the earth.
- Webster's Bible (WBS)
- Ye [are] blessed of the LORD who made heaven and earth.
- Young's Literal Translation (YLT)
- Blessed [are] ye of Jehovah, maker of heaven and earth,
Read in context
- 13పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.
- 14యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
- 15భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.
- 16ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
- 17మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు
Cross references
- Psalm 134:3 కీర్తనలు 134:3భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.
- Revelation 14:7 ప్రకటన 14:7అతడుమీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.
- Genesis 1:1 ఆదికాండము 1:1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
- Genesis 14:19 ఆదికాండము 14:19అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు,
- Psalm 121:2 కీర్తనలు 121:2యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
- Psalm 96:5 కీర్తనలు 96:5జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు.
- Psalm 124:8 కీర్తనలు 124:8భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
- Genesis 32:26–29 ఆదికాండము 32:26–29ఆయన - తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు - నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను. ఆయన నీ పేరేమని యడుగగా అతడు - యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు - నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన - నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.
- Acts 14:15 అపొస్తలుల కార్యములు 14:15అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.
- Ephesians 1:3–4 ఎఫెసీయులకు 1:3–4మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు,
- 1 Peter 3:9 1 పేతురు 3:9ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
- Psalm 146:5–6 కీర్తనలు 146:5–6ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.