Psalms · chapter 119 · verse 36
Psalm 119:36 in Telugu
లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.
Lobhamutattu kaaka nee shaasanamulatattu naa hrudayamu trippumu.
Psalm 119:36 in English
- King James Version (KJV)
- Incline my heart unto thy testimonies, and not to covetousness.
- World English Bible (WEB)
- Turn my heart toward your statutes, not toward selfish gain.
- American Standard Version (ASV)
- Incline my heart unto thy testimonies, And not to covetousness.
- Bible in Basic English (BBE)
- Let my heart be turned to your unchanging word, and not to evil desire.
- Darby Translation (DBY)
- Incline my heart unto thy testimonies, and not to gain.
- Webster's Bible (WBS)
- Incline my heart to thy testimonies, and not to covetousness.
- Young's Literal Translation (YLT)
- Incline my heart unto Thy testimonies, And not unto dishonest gain.
Read in context
- 34నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును.
- 35నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము.
- 36లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.
- 37వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
- 38నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.
Cross references
- Luke 12:15 లూకా 12:15మరియు ఆయన వారితోమీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను.
- Hebrews 13:5 హెబ్రీయులకు 13:5ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
- Mark 7:21–22 మార్కు 7:21–22లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభి చారములును లోభములును చెడుతనములును కృత్రిమ మును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.
- Psalm 51:10 కీర్తనలు 51:10దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
- 1 Kings 8:58 1 రాజులు 8:58తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగాను, తాను మన పిత రులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను, మన హృదయములను తనతట్టు త్రిప్పుకొనును గాక.
- Colossians 3:5 కొలొస్సయులకు 3:5కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.
- 2 Peter 2:3 2 పేతురు 2:3వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.
- Exodus 18:21 నిర్గమకాండము 18:21మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పది మందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను.
- 2 Peter 2:14 2 పేతురు 2:14వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వ మందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాప గ్రస్తులునైయుండి,
- 1 Timothy 6:17 1 తిమోతికి 6:17ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
- Psalm 141:4 కీర్తనలు 141:4పాపము చేయువారితో కూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.
- Ezekiel 11:19–20 యెహెజ్కేలు 11:19–20వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును.