Psalms · chapter 119 · verse 38
Psalm 119:38 in Telugu
నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.
Nee vichchina vaakyamu manushyulalo nee bhayamunu puttinchuchunnadi nee sevakuniki daani sthiraparachumu.
Psalm 119:38 in English
- King James Version (KJV)
- Stablish thy word unto thy servant, who [is devoted] to thy fear.
- World English Bible (WEB)
- Fulfill your promise to your servant, that you may be feared.
- American Standard Version (ASV)
- Confirm unto thy servant thy word, Which [is in order] unto the fear of thee.
- Bible in Basic English (BBE)
- Give effect to your word to your servant, in whose heart is the fear of you.
- Darby Translation (DBY)
- Establish thy *word unto thy servant, who is [devoted] to thy fear.
- Webster's Bible (WBS)
- Establish thy word to thy servant, who [is devoted] to thy fear.
- Young's Literal Translation (YLT)
- Establish to Thy servant Thy saying, That [is] concerning Thy fear.
Read in context
- 36లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృదయము త్రిప్పుము.
- 37వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.
- 38నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.
- 39నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము.
- 40నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.
Cross references
- Jeremiah 32:39–41 యిర్మీయా 32:39–41మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.
- Psalm 147:11 కీర్తనలు 147:11తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.
- 2 Corinthians 1:20 2 కొరింథీయులకు 1:20దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.
- Psalm 103:17 కీర్తనలు 103:17ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద
- Psalm 103:13 కీర్తనలు 103:13తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
- Psalm 103:11 కీర్తనలు 103:11భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.
- 2 Samuel 7:25–29 2 సమూయేలు 7:25–29దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబ మునుగూర్చియు నీవు సెలవిచ్చినమాట యెన్నటికి నిలుచు నట్లు దృఢపరచి సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చినమాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా సైన్యములకధిపతియగు యెహోవానీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వ దించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి యున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.
- Psalm 145:19 కీర్తనలు 145:19తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.
- Psalm 119:49 కీర్తనలు 119:49(జాయిన్) నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసి కొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు.